100కు 97 మార్కులు ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు .. సీఎం జగన్

0
197

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మొత్తం వచ్చేశాయి. 13 మున్సిపాలిటీలకు, ఒక కార్పొరేషన్ కు జరిగిన ఎన్నికల్లో ఈ రోజు ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం వైసీపీ కైవసం చేసుకుంది. ఒక్క మున్సిపాలిటీ మాత్రమే టీడీపీ వశం అయిపోయింది. ప్రకాశం జిల్లాలోని దర్శి మున్సిపాలిటీని మినహాయిస్తే మిగతా అన్ని చోట్ల వైసీపీ విజయఢంకా మోగించింది.

ఇక నెల్లూరు కొర్పొరేషన్ ఎన్నికలు అయితే మొత్తం 54 స్థానాలు ఉండగా.. మొత్తం వైసీపీ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీ.. వైసీపీ ఫ్యాన్ గాలికి తట్టుకోలేకపోయింది. దీంతో వైసీపీ శ్రేణులు ఆనందోత్సవాల మధ్య టపాసులు కాల్చతున్నారు. వాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

ప్రజలు ప్రభుత్వానికి 100కు 97 మార్కులు వేశారన్నారు. ఈ మేరకు అతడు ట్విట్టర్ లో ఇలా ట్వీట్ చేశారు. ‘‘దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు… ఇవే ఈ రోజు ఇంతటి ఘన విజయాన్ని అందించాయి. గ్రామంతో పాటు నగరం కూడా పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలిచింది.

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో 100కు 97 మార్కులు వేసిన అవ్వాతాతలు, అక్కాచెల్లెళ్ళు, సోదరులందరికీ ధన్యవాదాలు’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. ఇక కుప్పం మున్సిపాలిటీ వైసీపీ కైవసం చేసుకోవడం ప్రతీ ఒక్కరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇలాకా లో వైసీపీ పాగా వేయడంతో అక్కడి వైసీపీ కార్యకర్తలకు నూతన ఉత్సాహాన్ని ఇచ్చిందనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here