Samantha -Naga Chaitanya: టాలీవుడ్ క్రేజీ కపుల్ సమంత నాగచైతన్య గత ఏడాది అక్టోబర్ నెలలో విడాకుల ప్రకటన చేసిన విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే వీరు విడాకులు ప్రకటించి దాదాపు ఆరు నెలలు పూర్తి కావచ్చినప్పటికీ వీరి విడాకుల గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక వీరు విడాకులకు సరైన కారణం తెలియకపోయినప్పటికీ వీరి విడాకులపై ఎన్నో వార్తలు షికార్లు చేశాయి.

తాజాగా సమంత నాగచైతన్య విడిపోవడానికి ఆ హీరోయిన్ కారణం అంటూ సోషల్ మీడియా వేదికగా హీరోయిన్ రాశిఖన్నాను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అసలు సమంత నాగ చైతన్య విడిపోవడానికి రాశిఖన్నాకు సంబంధం ఏమిటి అనే విషయానికి వస్తే…

బాలీవుడ్ లవ్ బర్డ్స్ గా ఉన్నటువంటి సిద్ధార్థ్ మల్హోత్రా కియారా అద్వానీ వారి లవ్ బ్రేకప్ చెప్పుకుంటున్నారు అంటూ గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో వార్తలు బలంగా వినపడుతున్నాయి. ఈ క్రమంలోనే సిద్ధార్థ్ మల్హోత్రా సోషల్ మీడియా వేదికగా ‘ఏ డే విత్ అవుట్ సన్ షైన్ లైక్, యూ నో..నైట్’ అంటూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

స్పందించిన రాశిఖన్నా…
ఇక ఈ పోస్ట్ పై నటి రాశిఖన్నా స్పందిస్తూ ఫైర్ ఎమోజీని షేర్ చేశారు. దీంతో ఈమె కామెంట్ చూసిన నెటిజన్లు పెద్దఎత్తున ఈమెపై నెగిటివ్ కామెంట్లు కురిపిస్తున్నారు.ఈ క్రమంలోనే కొందరు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా విడిపోవడానికి నువ్వే కారణమా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోని మరికొంత మంది నెటిజన్లు ఇంకొక అడుగు ముందుకేసి సమంత నాగచైతన్య విడిపోవడానికి కూడారాశిఖన్నా కారణం అంటూ కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం వల్ల రాశిఖన్నా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు.
































