Actress Krishnaveni: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నటి కృష్ణవేణి గురించి అందరికీ తెలిసిందే. 1979లో నగ్నసత్యం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కృష్ణవేణి ఎన్నో సినిమాలలో నటిగా సహాయనటిగా అద్భుతమైన పాత్రలో నటించి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఈ విధంగా ఇండస్ట్రీలో సుమారు 200కు పైగా సినిమాల్లో నటించి ఎంతో మంచి గుర్తింపు పొందిన కృష్ణవేణి ప్రస్తుతం బుల్లితెరపై సీరియల్స్ లో బామ్మ పాత్రలలో నటిస్తున్నారు. ఇలా ఇండస్ట్రీలో ఇప్పటికీ కొనసాగుతున్న కృష్ణవేణి ఓ ఇంటర్వ్యూలో పాల్గొనీ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితంలో ‘వారాలబ్బాయి’ డైరెక్టర్ రాజచంద్రను పెళ్లి చేసుకున్నానని వెల్లడించారు.అయితే అప్పటికే ఆయనకు పెళ్లి అయ్యి ముగ్గురు పిల్లలు ఉన్నారని,ఇంటి అద్దె కూడా చెల్లించుకోలేని పరిస్థితులలో ఉన్న ఆయన ఒక్కో మెట్టు ఎక్కుతూ ఒక్కో సినిమాకి సుమారు 4 లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదగారని అయితే అదే సమయంలోనే ఆయన చనిపోయారని తెలియజేశారు.
అతని విజయాన్ని ఓర్వలేకే ఈ హత్య…
ఇక ఆయనను పెళ్లి చేసుకున్న తర్వాత నాలుగు సంవత్సరాలు మేము కలిసి ఉన్నామని అయితే ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు 100 రోజులు ఆడటం వల్ల ఇండస్ట్రీ తనని చూసి ఓర్వ లేక పోయిందని తెలియజేశారు. ఈ క్రమంలోనే ఒక హీరోయిన్ తనని కరెంటు వైర్ లతో కాల్చి హత్య చేయించిందని కృష్ణవేణి ఈ సందర్భంగా తన భర్త హత్యకు గల కారణాలు తెలియజేశారు.ఇక తన భర్త హత్య గురించి పోలీసులు మాట్లాడుతూ ఈ హత్య ఎవరు చేశారో మాకు తెలుసు అయినా తనని మేము ఏమీ చేయలేక పోతున్నాను అంటూ తెలియజేశారని వెల్లడించారు..ఈ విధంగా తన భర్తను చంపడమే కాకుండా మా కుటుంబానికి కూడా బెదిరింపులు వచ్చాయని అందుకే మా కుటుంబానికి పోలీసులు సుమారు రెండు సంవత్సరాల పాటు రక్షణ కల్పించారని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా కృష్ణవేణి తెలిపారు. తన భర్తను ఒక హీరోయిన్ హత్య చేయించింనే విషయం చెప్పినప్పటికీ ఆమె ఎవరు అనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు.































