Sneha Sharma: సినిమా అంటేనే ఓ రంగుల ప్రపంచం. మనకు ఎంతో అద్భుతంగా కనిపించే ఈ రంగుల ప్రపంచం వెనుక మన కంటికి కనిపించని ఎన్నో మరకలు ఉంటాయి.తెరపై ప్రతి ఒక్క ప్రేక్షకుడిని సందడి చేసే నటీమణులు తెర వెనుక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంఘటనల గురించి ఎంతో మంది సినీ తారలు బహిరంగంగా తెలియజేశారు.

సినిమా ఇండస్ట్రీలో ఎదగాలంటే తప్పనిసరిగా కమిట్మెంట్ ఇవ్వాల్సిందేనని చాలామంది కెరియర్ మొదట్లో వారు ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి వెల్లడించారు. తాజాగా మరొక హీరోయిన్ సైతం క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నా ప్రేమ నాకు కావాలి ఇండిపెండెంట్ హీరోయిన్ స్నేహ శర్మ తాజాగా క్యాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పారు.

ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా స్నేహ శర్మ మాట్లాడుతూ ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఇలాంటి ఇబ్బందులు తాను కూడా ఫేస్ చేశానని తనని కూడా కమిట్మెంట్ అడిగారు.అందుకు నేను నో చెప్పడంతో ఆ సినిమాలో నుంచి నన్ను తొలగించారని తెలిపారు.
నిర్ణయం మనదే…
ఇలా ఓ పెద్ద సినిమాలో నటించే అవకాశం తాను కోల్పోయానని అయితే అవకాశాల కోసం ఇలాంటి పాడు పనులు చేసి బ్రతకడం కన్నా అడుక్కు తిని బ్రతకడం ఎంతో మంచిదని ఈమె తెలిపారు. ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇలాంటి అనుభవం ఎదురవుతుందని అయితే నిర్ణయం మన పైనే ఆధారపడి ఉంటుందని అడిగేవాళ్లు అడుగుతారు.. కానీ బలవంతం ఉండదంటూ స్నేహ శర్మ క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు.































