Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి నటించిన చిత్రం భీమ్లా నాయక్ సినిమా నేడు రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే పవన్ అభిమానులు థియేటర్ల దగ్గర పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.అయితే గత కొద్ది రోజుల నుంచి ఏపీ ప్రభుత్వానికి టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు మధ్య టికెట్ల విషయంపై పెద్దఎత్తున చర్చలు జరుగుతున్న విషయం మనకు తెలిసిందే.

అయితే గతంలో రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పవన్ చేసిన వ్యాఖ్యలు అతని భీమ్లానాయక్ సినిమా పై తీవ్రమైన ప్రభావం చూపుతాయని పవన్ అభిమానులు భావించారు ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం ఈ విషయంపై స్పందిస్తూ మేము పవన్ కల్యాణ్ సినిమాను ఏ మాత్రం టార్గెట్ చేయడం లేదంటూ ఏపీ ప్రభుత్వం తెలియజేసింది.

ఇదిలా ఉండగా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన బంగార్రాజు చిత్రానికి ఏపీలో ఒక్కో టికెట్ ధర 200 చొప్పున అమ్మారు. ఇదేంటి అని ప్రశ్నించగా ఈ సినిమాకు స్పెషల్ పర్మిషన్ ఉందని థియేటర్ ఓనర్స్ వెల్లడించారు. ఇలా బంగార్రాజు సినిమా విషయంలో ఏపీ ప్రభుత్వం టికెట్ ధర 200 వరకు అమ్మారు. అదే పవన్ కళ్యాణ్ సినిమా విషయానికి వస్తే కేవలం రూ.70 టికెట్ ధర మాత్రమే ఉంది.
పవన్ కళ్యాణ్ మార్కెట్ ఐదు రెట్లు ఎక్కువ….
ఈ విషయం పక్కన ఉంచితే బంగార్రాజు సినిమా మాదిరిగా పవన్ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా లేవు. అలాగే బెనిఫిట్ షోస్ కూడా లేకపోవడంతో పవన్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జునతో పోలిస్తే పవన్ కళ్యాణ్ కు ఐదు రెట్ల మార్కెట్ ఎక్కువగానే ఉంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ సినిమా పై ఏ విధమైనటువంటి కక్షసాధింపు లేదంటూనే ఏపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
































