పెన్షన్ నిబంధనలను మార్చిన కేంద్రం.. వారందరికీ ప్రయోజనం..?

0
263

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. పెన్షన్ కు సంబంధించిన నిబంధనలలో అనేక మార్పులు చేసింది. అయితే కేంద్రం మార్చిన నిబంధనల వల్ల కొందరికి మాత్రమే ప్రయోజనం చేకూరనుంది. డిఫెన్స్ ఉద్యోగులకు ఏడు సంవత్సరాల వరుస సర్వీస్ నిబంధన ఉండగా కేంద్రం తాజాగా ఆ నిబంధనను తొలగించింది. చాలా సంవత్సరాల నుంచి డిఫెన్స్ ఉద్యోగులు ఈ నిబంధన తొలగించాలని కేంద్రాన్ని కోరుతున్నారు.

కేంద్ర రక్షణ శాఖ నోటిఫికేషన్ ను విడుదల చేసి ఈ విషయాన్ని వెల్లడించింది. డిఫెన్స్ ఉద్యోగులు ఎన్‌హ్యాన్స్‌డ్ ఫ్యామిలీ పెన్షన్ కు అర్హులు కావాలంటే ఏడేళ్ల వరుస సర్వీస్ అనే నిబంధన ఉండేది. ఏడు సంవత్సరాల వరుస సర్వీస్ నిర్వహించకపోతే పెన్షన్ కు అర్హులు కారు. అయితే తాజాగా మార్చిన నిబంధనల ప్రకారం ఏడేళ్ల సర్వీస్ లేకపోయినా పెన్షన్ కు అర్హులు కావడంతో పెన్షన్ యొక్క పూర్తి ప్రయోజనాలను ఉద్యోగులు పొందుతారు.

రక్షణ శాఖ ఉద్యోగి ఏ కారణం చేతనైనా మరణిస్తే ఉద్యోగి మరణించిన రోజు నుంచి పది సంవత్సరాల పాటు ఎన్‌హ్యాన్స్‌డ్ ఫ్యామిలీ పెన్షన్ ను అందజేస్తామని రక్షణ శాఖ వెల్లడించింది. ఈఓఎఫ్‌పీ కింద ఉద్యోగి వేతనంలో సగం కేంద్రం ఉద్యోగులకు అందజేయనుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల డిఫెన్స్ ఉద్యోగుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఉద్యోగి కుటుంబానికి ప్రయోజనం చేకూర్చే విధంగా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటోంది.

గతంలో కేంద్ర ప్రభుత్వం 30 శాతం మాత్రమే పెన్షన్ రూపంలో మరణించిన వారి కుటుంబానికి ఇచ్చేది. రిటైర్మెంట్ అయిన వారికి, సర్వీసులో లేని వారికి మాత్రమే 50 శాతం పెన్షన్ ను అందించేది. తాజాగా కేంద్రం పూర్తిస్థాయిలో నిబంధనలను మార్చి ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా అడుగులు వేయడం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here