సైరా తరువాత మెగాస్టార్ చిరంజీవి జోరు మీదున్నారు. వరసగా సినిమాలను ప్రకటిస్తూ ఫ్యాన్స్ గుడ్ న్యూస్ చెబుతున్నారు. ఇప్పటికే అరడజన్ సినిమాలను పట్టాలేక్కించేందుకు సిద్ధంగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రామ్ చరన్ తేజ్ కీలక పాత్ర పోషిస్తున్న ఆచార్య దాదాపుగా పూర్తయింది. 2022 ఫిబ్రవరి 4 నాటికి విడుదలకు సిద్ధమవుతోంది.

ఇదిలా ఉంచితే మళయాళ లూసీఫర్ రిమేక్ గాడ్ ఫాదర్, తమిళ వేదాళం రిమేక్ భోళా శంకర్ సినిమాతో పాటు బాబీ సినిమాకు ప్రీప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో బాబీ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఈ మూడు సినిమాలను తక్కువ గ్యాప్ తో రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది. గాడ్ ఫాదర్ సినిమాను మూడు నెలల్లో పూర్తి చేయాలని దర్శకుడు మోహన్ రాజాకు చిరు ఇప్పటికే చెప్పినట్లు తెలిసింది.
వచ్చే ఏడాది మొదట్లో మెగాస్టార్ ఆచార్య ప్రేక్షకుల ముందుకు రాగా.. వేసవిలో గాడ్ ఫాదర్, దసరాకు బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మెగాస్టార్ మరో ప్రాజెక్ట్ ను కూడా ఓకే చేసినట్లు తెలుస్తోంది. వెంకికుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఈ సినిమాకు దానయ్య నిర్మా తగా చేస్తున్నా డు. దీంతో పాటు బోయపాటి దర్శకత్వంతో కూడా మరోసినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు మెగాస్టార్.
అరడజన్ సినిమాలతో కుర్రహీరోలకు గుబులు పుట్టిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. సైరా తరువాత ప్రేక్షకులకు మరింత వినోదం పంచేందుకు వరసపెట్టి సినిమాలను చేస్తున్నారు. ఏడాదికి ఒక సినిమా చేయడానికే అపసోపాలు పడుతున్న కుర్ర హీరోలకు మెగాస్టార్ వరసపెట్టి సినిమాలు చేస్తుండటం చూస్తుంటే ఆశ్యర్యానికి గురిచేస్తోంది.
































