Money Lose: నేరాల తీరు మారుతోంది. ఒకప్పుడు డబ్బులు కావాలంటే ఇళ్లకు కన్నాలు వేసేవారు. కానీ ఇటువంటి నేరాలు చాలా వరకు తగ్గాయి. అయితే ఇప్పుడు నేరాల తీరులో చాలా మార్పులు వచ్చాయి. వైట్ కాలర్ దొంగతనాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా టెక్నాలజీని యూస్ చేసుకుని.. నేరాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు.

మోసపోవడానికి కేవలం సెల్ ఫోన్, కంప్యూటర్ కారణం అవుతోంది. మనం అప్లై చేయని లాటరీ మనకు తగిలినట్లు.. మనకు అసలే సంబంధం లేని దేశం నుంచి గిఫ్టు వస్తున్నట్లు, లారీల్లో కోట్ల రూపాయలు వచ్చాయని.. ప్రాసెసింగ్ ఫీజు చెల్లిస్తే చాలు కోట్లు మీరు సొంత చేసుకోవచ్చని మేసేజ్ లు, ఈమెయిల్ లు పెడుతుంటారు.

దీంతో కోట్ల మోజులో ప్రజలు మోసపోతున్నారు. మనం అప్లై చేయని లాటరీలు ఎలా తగులుతాయని ఒక్క క్షణం ఆలోచిస్తే మోసపోయే అవకాశం ఉండదు. ఇదిలా ఉంటే మరోవైపు ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్, ఓటీటీ ద్వారా బ్యాంకులోని డబ్బును తస్కరిస్తున్నారు నేరగాళ్లు.
వారికి రెస్పాండ్ కావొద్దు..
పోలీసులు ఎంతగా ఇటువంటి నేరాల గురించి అవగాహన కల్పిస్తున్నా.. ఎక్కడో చోట ఎవరో ఒకరు మోసానికి గురువుతున్నారు. కేటుగాళ్లు అడిగిన డబ్బును భారీ మెత్తాన్ని ఇచ్చి… తర్వాత మోసపోయామని లబోదిబోమంటున్నారు. అంత అయిపోయిన తర్వాత పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా ఇటువంటి నేరాలను కట్టడి చేసేందుకు రాచకొండ కమిషనరేట్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ఆన్ లైన్ పోసాలకు గురైన బాధితులు ఎవరైనా ఉన్నా.. ఆలస్యం చేయకుండా 155260 లేదా 100 నెంబర్ కు ఫోన్ చేసి దీంతో పోగొట్టుకున్న డబ్బు తిరిగి సంపాదించుకునే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. అనుమానాస్పదంగా కనిపించే, ఫోన్లకు వచ్చే లింకులను ఎట్టిపరిస్థితుల్లో క్లిక్ చేయవద్దని, అన్ నోన్ నెంబర్లకు రెస్పాండ్ కావద్దని పోలీసులు సూచిస్తున్నారు.
































