బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ లో మొదటి వారమే ఒకరు ఎలిమినేషన్ కావడం సర్వసాధారణం. అయితే ప్రస్తుతం తెలుగు బుల్లితెర ప్రసారమవుతున్న తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో ఈ వారం ఎలిమినేషన్ లిస్టులో రవి, కాజల్, సరియు హమీద, మానస్ ఉండగా వీరిలో ఈరోజు సరియు హౌస్ నుంచి బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న సరియు టైటిల్ పోరుకు తల పడతారని భావించినప్పటికీ, ఆమె మొదటి వారమే హౌస్ నుంచి బయటకు రావడానికి ప్రధానమైన కారణాలు ఇవేనని చెప్పవచ్చు.

మొదటి వారం ఓపెన్ నామినేషన్ పెట్టినప్పుడు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అది మన చేతుల్లో లేనిపని కనుక ఈ నామినేషన్స్ లో ఎంత జాగ్రత్త వ్యవహరించాల్సి ఉంటుంది. ఈవారం సరియు ను మొత్తం ముగ్గురు నామినేట్ చేయడంతో ఆమె ఎలిమినేట్ అవుతున్నట్లు తెలుస్తోంది.
సన్నీ ఆమెను నామినేట్ చేస్తూ చాలా చనువు తీసుకొని మాట్లాడుతున్నావ్ అని అది తనకు నచ్చలేదంటూ నామినేట్ చేయగా, ఇక మానస్ డై గేమ్ ఆడేటప్పుడు ట్రిక్స్ ప్లే చేశాడని సరియు అనటంతో తనని నామినేట్ చేశాడు. ఇక సరయు కాజల్ ని నామినేట్ చేసిందన్న ఉద్దేశంతో కాజల్ సరయును నామినేట్ చేసింది.
హౌస్ లో నామినేషన్ లిస్ట్ లో ఉన్న కంటెస్టెంట్ లు ఎవరికి వారు ఎనలైజ్ చేసుకుంటూ స్క్రీన్ స్పేస్ కోసం ట్రై చేయాలి. ఈ క్రమంలోనే రవి ఎంటర్టైన్ చేయగా, కాజల్ కావలసిగానే అందరితో చనువుగా ఉంటూ కంటెంట్ క్రియేట్ చేశారు. ఇక మానస్, హమీదా పవర్ రూమ్ టాస్క్ కోసం బాగా ప్రయత్నిస్తూ ఎవరికివారు హైలెట్ అయ్యారు.
ఈ విధంగా నామినేషన్ లిస్ట్ లో ఉన్న కంటెస్టెంట్ లు అందరూ ఏదో ఒక విషయంలో వారిని వారి నిరూపించుకోగా సరయు మాత్రం తనకేమీ పట్టనట్టుగా ఉంటూ ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేయకపోవడంతో ఈ వారం ఎలిమినేట్ అవడానికి ఇవే ప్రధాన కారణం అయ్యాయని చెప్పవచ్చు.




























