K Raghavendra Rao: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకేంద్రుడిగా మంచి పేరు సంపాదించుకున్న డైరెక్టర్ రాఘవేంద్ర రావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన దర్శకత్వంలో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. డైరెక్టర్ అయిన తర్వాత ఎన్నో హిట్ ఫ్లాప్ సినిమాలు రావడం సర్వసాధారణం.

ఇలా బ్యాడ్ టైం నడుస్తున్న సమయంలో ఎంతో మంచి బ్యానర్ లో మంచి కథతో సినిమాలు తీసిన కొన్నిసార్లు చేదు అనుభవాల్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఇలా 1988-90 లలో రాఘవేంద్రరావు విషయంలో కూడా ఇలా బ్యాడ్ టైం నదిచిందనే చెప్పాలి. అప్పటికే రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన యుద్ధభూమి, అగ్ని, ఒంటరి, రుద్రనేత్ర వంటి సినిమాలు అంచనాల నడుమ విడుదలైన ఈ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.

ఈ క్రమంలోనే రాఘవేంద్రరావు మంచి విజయం కోసం పోరాడుతున్న సమయంలో మోహన్ బాబు రమ్యకృష్ణ హీరోహీరోయిన్లుగా సినిమాను తెరకెక్కించాలని భావించారు. అయితే వీరిద్దరి కాంబినేషన్ అని తెలియగానే నిర్మాత సినిమాలు చేయడానికి ముందుకు రాలేదు. ఇక ఆ హీరోతో సినిమా వద్దని ఒక స్టార్ హీరో కూడా సలహా ఇచ్చారు.
ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ అయ్యింది..
విషయాలను పక్కనపెట్టి రమ్య కృష్ణ మోహన్ బాబు జంటగా అల్లుడుగారు సినిమాను ప్రారంభించారు. ఇలా ఈ సినిమాను స్వయంగా మోహన్ బాబు నిర్మించారు. అయితే ఈ సినిమా కూడా ఫెయిల్ అవుతుంది అని చాలామంది ఈ సినిమా గురించి కామెంట్లు చేశారు. వాటన్నింటినీ ఏమాత్రం పట్టించుకోకుండా రాఘవేంద్రరావు ఈ సినిమాని పూర్తి చేసి 1990 జులై 4వ తేదీ విడుదల చేశారు. అయితే ఈ సినిమాలో ఎవరూ ఊహించని విధంగా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమా విషయంలో ఆ స్టార్ హీరో సలహా పని చెయ్యలేదని చెప్పాలి.































