కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో యావత్ భారతదేశం మొత్తం లాక్ డౌన్ విధించింది కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం కూడా హైదరాబాద్ మహానగరాన్ని లాక్ డౌన్ విధించింది. అయితే శనివారం ఉదయం నుంచి హైదరాబాద్ లోని పలు ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారంటూ ప్రచారం జరుగుతుంది. దీనిపై తెలంగాణా వైద్య, ఆరోగ్య శాఖామంత్రి ఈటల రాజేందర్ స్పందించారు.

హైదరాబాద్ లోని ఇప్పటి వరకు ఎటువంటి ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించలేదని స్పష్టం చేసారు.. తప్పుడు సమాచారంతో ప్రజలను భయాందోళనలకు గురి చేయొద్దని ప్రచార మాధ్యమాలను కోరారు. రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందని. కరోనా బాదితులందరి పరిస్థితి నిశితంగా గమనిస్తున్నామని ఏ ఒక్క బాధితుడికి కూడా ఆందోళనకరంగా లేదని చెప్పారు.

కరోనా వైరస్ గాలితో వచ్చేది కాదని, కేవలం ఇతర దేశాల నుంచి వచ్చిన వారి ద్వారానే ఇతరులకు సోకుతుందని వివరించారు. మరియు గచ్చిబౌలిలో 1500 మందికి పైగా క్వారంటైన్ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఈ పనులు మరో ఆరు రోజుల్లో యుద్ధప్రాతిపదికన పూర్తీ చేస్తామని తెలిపారు.































