IIT Director: ప్రస్తుతం మన భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా కూడా టెక్నాలజీ అభివృద్ధిలో దూసుకుపోతోంది. అంతరిక్షంలోకి కూడా మానవుడు వెళ్తున్నాడంటే.. అర్థం చేసుకోవాలి.. ఎంతలా టెక్నాలజీ ముందుకు సాగుతోందో. అయితే కొన్ని ప్రాంతాలు, పల్లెటూర్లలో మాత్రం ఇంకా మూఢనమ్మకాలు, చాతబడులతోనే ఉంటున్నారు.

ఇలా ఎంతో మంది చాతబడులు చేస్తున్నారన్న నెపంతో హత్యలు చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అయితే సైన్స్ చెబుతున్నది ఏంటంటే.. దెయ్యాలు, చాతబడులు అనేవి లేవు.. కేవలం అవి కల్పితాలు మాత్రమే అని. కానీ ఇక్కడ చెప్పే ఓ న్యూస్ సైన్స్ నే దిక్కరించినట్లు ఉంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఐఐటీ మండి డైరెక్టర్ లక్ష్మీధర్ బహేరా సంచలన వ్యాఖ్యలు చేశాడు. దెయ్యాలు, ఆత్మలు ఉన్నాయని తెలిపాడు. 1993లో తన స్నేహితుడి కుటుంబసభ్యులు దెయ్యాల సమస్యతో బాధపడుతుంటే తాను సహాయం చేసినట్టు చెప్పుకొచ్చాడు.
ఫ్రొఫెసర్ ఇలా మాట్లాడటంతో కొంతమంది..
అంతే కాదు.. ఆ దెయ్యాలను పారదోలేందుకు భగవద్గీతలో మంత్రాలు, పూజలు చేసి.. వాటిని పారదోలినట్లు పేర్కొన్నాడు. దీంతో అతడి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఐఐటీ మండి డైరెక్టర్‌గా లక్ష్మీధర్ ఇటీవలే నియమితులయ్యారు. ఐఐటీ ఢిల్లీ నుంచి పీహెచ్‌డీ చేశారు. రోబోటిక్స్, కృత్రిమ మేధలో నిష్ణాతులు. ఇంత చదువు చదివిన ఈ ఫ్రొఫెసర్ ఇలా మాట్లాడటంతో కొంతమంది అతడు చెప్పినవి నిజమే అని అంటుంటే మరి కొంమంది మాత్రం అదంతా అబద్దమని.. ఈ రోజుల్లో కూడా దెయ్యాలు ఉండటం ఏంటని కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా దెయ్యాలు ఉన్నాయని నమ్మే వారు ఎక్కువగా ఉండటం విశేషం.































