పాన్ ఇండియా ప్రాజెక్టులపై కన్నేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..ఏకంగా ఆ ఇద్దరు డైరెక్టర్లతో..!!

0
52

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. పుష్ప అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది..అల్లు అర్జున్ కెరీర్లో మొట్టమొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ సినిమాలో అల్లుఅర్జున్ లారీ డ్రైవర్ గా నటిస్తున్నాడు. గంధపు చక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరక్కేకుతుంది.

ఈ సినిమాలో బన్నీ ఊరమాస్ గెటప్ లో కనిపించనున్నాడు..ఇప్పటికే బన్నీ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ సినిమా టీజర్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.. ఇదిలా ఉంటె కరోనా కారణంగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇటీవల బన్నీ కరోనా బారిన పడటంతో షూటింగ్ ఆగిపోయింది. ఈ సినిమా తెలుగు-తమిళం-మలయాళం- హిందీలో రిలీజ్ కానుంది.ఈ సినిమాతర్వాత బన్నీ వరుసగా పాన్ ఇండియా ప్రాజక్ట్స్ పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు బన్నీ.

పుష్ప సినిమా తర్వాత బన్ని క్యూలో కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ తో పాటు ఏ.ఆర్ మురుగదాస్ లాంటి దర్శకులు ఉన్నారని తెలుస్తుంది. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం కేజీఎఫ్ పార్ట్ 2ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా అయిపోయిన తరవాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సలార్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ ను తెరకెక్కిస్తున్నాడు. ఈ రెండు సినిమాల్లో కేజీఎఫ్ 2 షూటింగ్ పూర్తి కాగా సలార్ షూటింగ్ దశలో ఉంది.

అయితే నిజానికి పుష్ప సినిమా తర్వాత వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ సినిమా చేయాల్సి ఉంది కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయిందని తెలుస్తుంది..అయితే వకీల్ సాబ్ హిట్ అవ్వడంతో మళ్ళీ వేణు శ్రీరామ్, బన్నీల ఐకాన్ ప్రాజెక్ట్ గురించి పలు వార్తలు వచ్చాయి..కానీ వాటిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.. దీంతో ప్రశాంత్ నీల్, మురుగదాస్ ఇద్దరు డైరెక్టర్లతో రెండు ప్రాజెక్ట్ లను చేయాలని ప్లాన్ చేస్తున్నాడట బన్నీ..ఇవి రెండూ కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here