Covaxin: ప్రపంచమంతట కరోనా కొత్త వేరియంట్లలో రూపంలో వ్యాప్తి చెందుతున్న తరుణంలో అందరికీ కరోనా వ్యాక్సిన్ డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ దేశాలన్నింటికీ ఉత్తర్వులు జారీ చేసింది . ప్రస్తుతం ఒమిక్రాన్ చాప కింద నీరులా వ్యాప్తి చెందుతోంది . దీనిని అరికట్టటానికి 15-18 సంవత్సరాల పిల్లలకి కూడా వ్యాక్సిన్స్ వేస్తున్నారు. కో వ్యాక్సిన్ టీకా వేయించుకున్న తరువాత ఇటువంటి మందులు వాడటం అవసరం లేదు అని భారత్ బయోటెక్ కంపెనీ స్పష్టం చేసింది . ఇప్పుడు ఆ వివరాల గురించి తెలుసుకుందాం.

సాధారణంగా వ్యాక్సిన్స్ వేసిన తర్వాత అందరికీ పారాసెట్మాల్ టాబ్లెట్ ఇస్తూ వాటిని మూడు రోజులు వాడమని చెప్పేవారు . టీకా వేయించుకున్న తర్వాత కొందరిలో ఒళ్ళు నొప్పులు , తలనొప్పి , జ్వరం వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి . అందువల్ల టీకా వేయించుకున్న వారందరికీ మొదటిలో పారాసెట్మాల్ టాబ్లెట్స్ కూడా ఇచ్చేవారు . అయితే కో వ్యాక్సిన్ టీకా వేయించుకున్న వారికి పారాసెట్మాల్ టాబ్లెట్స్ వేసుకునే అవసరం లేదని భారత్ బయోటెక్ కంపెనీ తాజాగా ఈ విషయాన్ని స్పష్టం చేసింది .

కంపెనీ తాజాగా విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది . భారత్ బయోటెక్ కంపెనీ చేసిన ప్రకటన ప్రకారం ” కోవాక్సిన్ తీసుకున్నవారికి టీకా తీసుకున్న తరువాత పేరాసెట్మాల్ ట్యాబ్లేట్ వేసుకోమని సూచిస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. అయితే, కోవాక్సిన్ టీకా తీసుకున్నవారికి ఆ మాత్రల అవసరం ఉండదు. మేము జరిపిన క్లినికల్ ట్రయల్స్ లో ఈ విషయంలో ఒక నిర్ధారణ వచ్చింది.
ఎలాంటి మందులతో అవసరం ఉండదు..
ఈ క్లినికల్ ట్రయల్స్ 30 వేల మందిపైజరిపాము. అందులో కేవలం 10 నుంచి 20 శాతం మందికి మాత్రమే కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయి. అవికూడా చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. ఇవి ఒకటి రెండురోజుల్లో సాధారణ స్థితికి వచ్చేస్తాయి. దానికి ఏ విధమైన మందులతోనూ పనిలేదు.”ఒకవేళ ఏదైనా మందులు వాడాల్సిన పరిస్థితి ఉంది అని మీరు అనుకుంటే.. వైద్యుడిని సంప్రదించాలని కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది.































