Dil Raju: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత డిస్ట్రిబ్యూటర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో దిల్ రాజు ఒకరు.ఇక దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాలకు నైజాం ఏరియాలో ఫేక్ కలెక్షన్లు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే దిల్ రాజు ఈ వార్తలపై స్పందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…తాను డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించిన సినిమాలు కలెక్షన్ల గురించి బయటకు చెప్పడం సరికాదని ఆయన తెలియజేశారు. ఇక పోతే ఫేక్ కలెక్షన్ల వల్ల ఎవరికి ఎలాంటి లాభం లేదని అలా ఫేక్ కలెక్షన్స్ బయటకు చెప్పడం వల్ల అభిమానులు మాత్రమే ఒక అరగంట పాటు ఆనందం పొందుతారని, ఫేక్ కలెక్షన్స్ వల్ల ఎవరికీ ఒరిగేది ఏమీ లేదంటూ ఆయన వెల్లడించారు.

ఇక టికెట్ల రేట్లు గురించి మాట్లాడుతూ కేవలం హీరోలు నిర్మాతలు కోరిక మేరకే సినిమా టికెట్ల రేట్లను పెంచుతున్నామని, అంతకుమించి టిక్కెట్ల రేట్లను పెంచటానికి మరే కారణం లేదని తెలిపారు. ఇకపోతే దిల్ రాజు సమర్పణలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఎఫ్ 3. ఈ సినిమా ఈ నెల 27వ తేదీ విడుదల కానుంది.
టికెట్ల రేటు పెంచం…
ఇక ఈ సినిమా టికెట్ల రేట్లు గురించి దిల్ రాజు మాట్లాడుతూ ఈ సినిమా టికెట్ల రేట్లను ఏమాత్రం పెంచబోమని, టికెట్లను నార్మల్ ధరలకే అమ్మాలని రెండు నెలల క్రితమే తాను నిర్ణయం తీసుకున్నట్లు ఈ సందర్భంగా దిల్ రాజు ఎఫ్ 3 సినిమా టికెట్ల రేట్లు గురించి ప్రస్తావించారు.



























