అరటి పండు అనేది ప్రతీ ఒక్కరు ఇష్టపడే పండు. ఆసుపత్రిలో ఉన్న వాళ్లు ఎక్కుగా దీనిని తీసుకుంటారు. ఇది ముఖ్యంగా శరీరంలోని ఐరన్ లోపాన్ని మెరుగుపరిచి శక్తిని ఇస్తుంది. అరటి పండుతో పాటు పెరుగు కూడా ఆరోగ్యానికి ఎంతోమేలు చేస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఉదయాన్నే అరటి పండుతో పాటు పెరుగును కూడా తీసుకుంటే ఎన్నో ఉపయోగాలు ఉంటాయి.

సాధారణంగా పెరుగులో బ్యాక్టీరియా, కాల్షియం, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి.
అరటిలో విటమిన్లు, ఐరన్, ఫైబర్ లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి ప్రయోజనాలు చేకూర్చడమే కాకుండా.. శరీరానికి ఉల్లసాన్ని అందిస్తాయి. అరటిలో ఉండే ఫైబర్ పెరుగులో ఉండే బ్యాక్టీరియా రెండు శరీరానికి మేలు చేసేవి. ముఖ్యంగా బ్యాక్టీరియా అనేది జీర్ణవ్యవస్థను బలంగా ఉంచుతుంది. అలాగే కడుపు నొప్పి సమస్యలను తగ్గిస్తుంది.
ఎముకలు బలంగా ఉండటానికి కాల్షియం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉదయాన్నే అరటి పండు, పెరుగును కలిపి తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా తయారు అవుతాయి. ప్రస్తుత జీవన ప్రపంచంలో బరువుతో బాధపడే వారు చాలా ఎక్కువ మంది ఉంటారు. వారికి ఇదొక చక్కటి చిట్కాగా పనిచేస్తుంది. బరువు ఎక్కువగా ఉండే వారు దీనిని తీసుకోవడం వల్ల బరువును నియంత్రించొచ్చు. కొవ్వు పెరగకుండా దానిని కూడా అదుపు చేస్తుంది.
ఇవి రెండు కలిపి తీసుకోవడం వల్ల ఆకలి మందగిస్తుంది. దీంతో బరువు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. మలబద్దకంతో బాధపడే వారికి ఇలా ఉదయాన్నే పెరుగు, అరటి పండు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.






























