సకల పోషక విలువలు, ఔషధ గుణాలు మెండుగా ఉన్న నిమ్మ కాయను ప్రతిరోజు మన ఆహారంలో ఏదో ఒక రూపంలో ఆహారంగా తీసుకుంటే మన ఆరోగ్యాన్ని కాపాడడంలోను, మన శరీరానికి అవసరమైన వ్యాధినిరోధక శక్తిని పెంచడంలోను నిమ్మకాయలు కీలక పాత్ర వహిస్తాయి.నిమ్మకాయలో ఎక్కువగా విటమిన్ సీ, విటమిన్ ఇ, బీ6, థియామిన్, నియాసిన్, రిబోప్లేవిన్, ఫోలేట్ వంటి నిత్య జీవక్రియకు అవసరమైన అన్ని పోషక విలువలు సమృద్ధిగా లభిస్తాయి.

నిమ్మలో ఉండే ఆమ్ల స్వభావం అనేక రకాల వ్యాధులను దూరం చేస్తుంది. కావున ప్రతిరోజు ఉదయం అల్పాహారానికి ముందు నిమ్మకాయ జ్యూస్ ను ప్రతి రోజు సేవించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం…ప్రతిరోజు అల్పాహారం ముందు ఒక గ్లాస్ నిమ్మరసం తాగడం వల్ల నిమ్మలో ఉండే సిట్రిక్ యాసిడ్ కిడ్నీలో ఉండే క్యాల్షియం స్టోన్ను సమర్థవంతంగా కరిగించి బయటకు పంపి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
నిమ్మలో ఉండే ఆమ్ల స్వభావం జీర్ణ వ్యవస్థను మెరుగు పరిచి మలబద్ధకం, గ్యాస్ట్రిక్, అజీర్తి వంటి సమస్యలను దూరం చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి వ్యాధినిరోధక శక్తిని పెంచి సీజనల్ గా వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని దూరంగా ఉంచుతుంది. ప్రతిరోజు నిమ్మరసం సేవించడం వల్ల శరీరంలో పేరుకుపోయిన మలినాలు తొలగి రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగు పడుతుంది.నిమ్మ రసానికి చెడు కొలెస్ట్రాల్ ను కరిగించే గుణం ఉన్నందున గుండె సంబంధిత వ్యాధులు, బరువు పెరగడం వంటి సమస్యలను అధిగమించవచ్చు.

































