మహిళా గర్భం దాల్చడం అనేది ఒక వరం లాంటిది. అటువంటి సమయంలో ఏ ఫుడ్ తీసుకోవాలో చాలామందికి తెలవదు. ఎక్కువగా ప్రోటీన్లు, విటమిన్లు కలిగిన ఆహారాన్ని తీసుకుంటే పుట్టే బేబి ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా ఆరోగ్య కరమైన గర్భాధారణ కోసం ప్రతీ మహిళ తెలుసుకోవాల్సిన కొన్ని చిట్కాల గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం.

గర్భం వచ్చిందా.. రాలేదా అనేది శరీరంలో వచ్చే మార్పుల ఆధారంగా తెలుసుకోవచ్చు. శరీరంలో మార్పులను గమినిస్తే వెంటనే ప్రెగ్నేన్సీ టెస్ట్ చేయించుకోవాలి. ఒకవేళ పాజిటివ్ గా రిపోర్ట్ వస్తే.. అటు వంటి సమయంలో ఏం తినాలి.. ఎలాంటి వాటికి దూరంగా ఉండాలి అనే వాటిని ఇంటి పెద్దలను అడిగి తెలుసుకోవాలి. ఒక వేళ ఇంట్లో ఎవరూ లేకపోతే.. ఇక్కడ చెప్పే కొన్ని టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది.
సాధారణంగా గర్భం దాల్చిన మహిళతో పొల్చితే సాధారణ మహిళలు బరువు తక్కువగా ఉంటారు. ప్రతీ నెల ప్రెగ్నెన్సీ వచ్చిన మహిళ బరువు పెరుగుతూ ఉంటారు. ప్రెగ్నెన్సీ సమయంలో అధిక బరువు ఉండటం కూడా ప్రమాదకరమే. దాదాపు 10 నుంచి 12 కిలోల వరకు బరువు పెరిగితే పర్వాలేదు కానీ.. అంత కంటే ఎక్కువగా బరువు పెరిగితే ప్రమాదం అని నిపుణులు తెలుపుతున్నారు. ఇక తినే పండ్ల విషయంలో అధికంగా పోలిక్ యాసిడ్ ఉన్న పండ్లను తీసుకోవాలి.
నీటిని ఎక్కువగా తాగాలని వైద్యులు తెలుపుతున్నారు. రెండో నెలలో 350 అదనపు కేలరీలు.. మూడో నెలలో 450 అదనపు కేలరీలను తీసుకోవాలి. వైద్యుల సూచనల మేరకు వ్యాయామం, స్విమ్మింగ్ చేయడం వంటివి చేస్తుండాలి. పడుకునే సమయం దాదాపు 6 నుంచి 8 గంటల మధ్య ఉండే విధంగా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల పెరుగుతున్న శిశువు ఆరోగ్యకరంగా జన్మిస్తాడు.






























