Senior Heoins: తమ అందచందాలతో ఒకప్పుడు వెండితెరను ఏలిన వారిలో కొంత మంది పెళ్లికి దూరంగా ఉన్నారు. ప్రేమ విఫలం కావడంతో కొంత మంది పెళ్లిళ్లు చేసుకోలేకపోతే.. మరికొంత మంది పెళ్లి ఉద్దేశ్యం లేక ఒంటరిగా మిగిలారు. టబు, నగ్మా, శోభన, జయపద్ర, రేఖ, అమిషా పటేల్, సితార వంటి హీరోయిన్లు ఐదు పదులు దాటినా.. పెళ్లికి దూరంగానే ఉన్నారు. వీరి బాటలోనే సమంత నడుస్తుందా.. అనే అనుమానాలు కూడా వస్తున్నాయి.

టబు:
90లో ఇటు తెలుగు, అటు హిందీ చిత్ర సీమలో తన అందాలతో, నటనతో మెప్పించిన హీరోయిన్ టబు. యాభై ఏళ్లు దాటినా.. ఈ సుందరి ఒంటరిగానే ఉంటోంది. గతంలో అజయ్ దేవ్ గన్ తో ప్రేమయాణం కూడా నడిపింది. టాలీవుడ్ హీరో నాగార్జునతో కూడా ఎఫైర్ ఉందనే రూమర్లు కూడా ఉన్నాయి. అజయ్ దేవగన్ నటి కాజోల్ ను పెళ్లి చేసుకోవడంతో అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటుంది.

నగ్మా:
తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో సత్తా చాటిన నటి నగ్మా. తన అందంతో కుర్రకారు మతిపోగోట్టింది. అయితే నగ్మా కూడా పెళ్లి చేేసుకోకుండా ఒంటరిగా ఉంటోంది. గతంతో మాజీ క్రికెటర్ గంగూలీతో ప్రేమాయణం కూడా నడిపింది. ఒకానొక దశలో వీరిద్దరు పెళ్లి చేసుకుంటారనే వార్తలు కూడా వచ్చాయి. ఏమైదో ఏమో కానీ గంగూలీకి దూరమైన నగ్మా ప్రస్తుతం ఒంటరిగానే ఉంటోంది.

అమిషా పటేల్:
బద్రి, నాని, నరసింహుడు సినిమాలతో తెలుగు తెరపై కనిపించిన అమిషా పటేల్ చాలా క్రేజ్ తెచ్చుకుంది. అయితే ఇటు తెలుగులో కానీ.. అటు హిందీలో కానీ పెద్దగా కెరీర్ సక్సెస్ కాలేదు. నలభై ఏళ్లకు పైబడిన ఈ అమ్మడు పలు రిలేషన్లు కూడా నడిపింది. ఫిల్మ్ మేకర్ విక్రమ్ భట్‌తో ప్రేమాయణం సాగించింది. చాలా రోజులు వీరి లవ్ స్టోరీ నడించింది. పలు వివాదాలను ఎదుర్కొంది. అనేక వివాదాల అనంతరం వీరిద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు. ఆ తర్వాత వ్యాపారవేత్త కనవ్ పూరితో ప్రేమలో ఉన్నట్టు వెల్లడించారు. అయితే ఇప్పటికీ పెళ్లి ఉద్దేశ్యం లేనట్టుంది అమిషా పటేల్ కి.

రేఖ:
బాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసిని తార రేఖ కూడా ఇప్పటికీ ఒంటరిగా ఉంటోంది. బిగ్ బీ అమితాబ్ తో ప్రేమాయణం కూడా నడిపింది. ఈ తరువాత 1990లో ఢిల్లీ బెస్డ్ వ్యాపరవేత్ ముఖేష్ అగర్వాల్ తో వివాహం చేసుకుంది. అయితే ఆ ఏడాదే ముఖేష్ డిప్రెషన్ తో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తరువాత నుంచి ఒంటరిగానే ఉంటోంది.

శోభన:
క్లాసికల్ డాన్సర్ గా, నటిగా గుర్తింపు తెచ్చుకుంది శోభన. తమిళ, తెలుగు, మళయాళ చిత్ర పరిశ్రమల్లో రజినీకాంత్, చిరంజీవి, మోహన్ లాల్ వంటి అగ్ర కథానాయకులతో సినిమాలు చేసింది. అయితే పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేకపోవడంతో ఒంటరిగానే ఉంటోంది. ఓ అమ్మాయిని దత్తత తీసుకుంది.

జయప్రద:
తెలుగుకి చెందిన అలనాటి అందాల తార జయప్రద తెలుగు, హిందీ భాషల్లో గుర్తివంపు తెచ్చుకుంది. ఇప్పటికీ ఒంటరిగానే ఉంటోంది. ఆమె 1986లో నిర్మాత శ్రీకాంత్ నహతాని వివాహం చేసుకుంది. కానీ అప్పటికే అతనికి పెళ్లై ముగ్గురు పిల్లలున్నారు.ఈ విషయం తెలిసి అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో ఆయనకు దూరంగా ఉంటుంది జయప్రద. సమాజ్ వాదీ పార్టీ నేత అమర్ సింగ్ శిష్యురాలుగా ఉంటోంది.

సితార:
క్యారెక్టర్ నటిగా, హీరోయిన్ గా అందరికి తెలిసిన నటి సితార. తమిళ హీరో మురళితో ప్రేమాయణం కొనసాగించింది. ఈ ప్రేమ విఫలం కావడంతో అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటోంది.
సమంత కూడానా..?
ప్రస్తుతం నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సమంత ప్రస్తుతం రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తోంది. అయితే ఈ అమ్మడు మళ్లీ పెళ్లి చేసుకుంటుందా..? లేదా ఒంటరిగానే ఉంటుందా.. అనే అనుమానాలు కలుగుతున్నాయి.































