మహాభారతం మనకు ఎన్నో విషయాలను నేర్పిస్తుంది. ఎటువంటి పరిస్థితులలో ఏ విధంగా ప్రవర్తించాలి, మనకు వ్యతిరేకంగా ఉన్న సమయాలలో ఏ విధంగా ప్రవర్తించాలనే నీతి కావ్యాలను మహాభారతం మనకు తెలియజేస్తుంది. ఏదైనా సంక్లిష్ట సమయంలో నిర్ణయాలు తీసుకోవడానికి కూడా మహాభారతం మనకు ఎంతో ఉపయోగపడుతుంది. సాధారణంగా మహాభారతం అంటే యుద్ధాలు, పోరాటాలు అని భావిస్తాము. ఇది మాత్రమే కాకుండా మహాభారతంలో కూడా ఎన్నో మధురమైన ప్రేమ కథలు ఉన్నాయి. మరి ఆ ప్రేమ కథలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

  • రుక్మిణీ – శ్రీకృష్ణులకు ప్రేమకథ:
    మహాభారతంలో రుక్మిణి శ్రీకృష్ణ వివాహం ఎంతో ప్రత్యేకమైనది.రుక్మిణీదేవి-శ్రీకృష్ణుడు ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకుంటారు.రుక్మిణి సోదరుడు అయిన రుక్మికి ఇష్టముండదు.శ్రీకృష్ణుడు, కంసుడిని హతమార్చడం వల్ల అతడు సోదరి ఇష్టానికి వ్యతిరేకంగా నిలిచాడు. దీంతో రుక్మిణి.. తనను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనే సందేశం శ్రీకృష్ణుడికి చేరవేయగా శ్రీకృష్ణుడు బలరాముడితో సహా ద్వారకా వచ్చి రుక్మిని వివాహం చేసుకుంటాడు.
  • సుభద్ర-అర్జునుడు:
    శ్రీకృష్ణుడి సోదరి సుభద్ర.. అర్జునుడి ప్రేమిస్తుంది. అయితే సుభద్ర పెద్దన్నయ్య బలరాముడు ఆమె ప్రేమను ఒప్పుకోడు.తన చెల్లెలు సుభద్రని తన స్నేహితుడు దుర్యోధనుడికి ఇచ్చి వివాహం జరిపించాలని భావిస్తాడు. కానీ శ్రీ కృష్ణుడు మాత్రం తన సోదరి సుభద్ర ఇష్టప్రకారమే అర్జునుడికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు.
  • భానుమతి-దుర్యోధనుడి వివాహం:
    మహాభారతంలో భానుమతి-దుర్యోధనుడి వివాహం ప్రత్యేకమైంది. భానుమతి స్వయంవరానికి జరాసంధుడు, శిశుపాలు, రుక్మీలతో సహా దుర్యోధనుడు కూడా వెళ్తాడు. జయమాల ఎవరిమెడలో వేస్తే అతడు ఆమె భర్తగా మారతాడు. ఈ క్రమంలోనే భానుమతి జయమాలని తీసుకుని నడుస్తుండగా దుర్యోధనుడు బలవంతంగా ఆమె తన మెడలో వేసేలా ప్రేరేపిస్తాడు. దీంతో అనుకోకుండా భానుమతి దుర్యోధనుడిని వివాహం చేసుకుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here