బుల్లితెరపై ప్రసారమవుతున్న రియాలిటీ షోలలో బిగ్ బాస్ రియాలిటీ షో కి ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు వారాలను విజయవంతంగా పూర్తిచేసుకుంది. ఈ క్రమంలోనే ఈ వారం ముందుగా అనుకున్నట్లే నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. నట రాజ మాస్టర్ ఎలిమినేషన్ అంటూ బిగ్ బాస్ చెప్పగానే హౌస్ లో ఉన్నటువంటి సభ్యులు అందరూ కాస్త ఎమోషనల్ అయ్యారు.

ఈ క్రమంలోనే నట్రాజ్ మాస్టర్ ఎలిమినేట్ కావడంతో లోబో అనీ మాస్టర్, ప్రియాంక ఎమోషనల్ అయ్యి అతనితో గడిపిన సన్నివేశాలను గుర్తు చేసుకున్నారు. ఇలా హౌస్ నుంచి బయటకు వచ్చిన నటరాజ్ మాస్టర్ తో నాగార్జునతో మాట్లాడుతూ…ఏదో సాధిస్తానని హౌస్ లోకి వెళ్ళిన నేను ఏమీ సాధించకుండా వెనుదిరిగానని చెప్పడంతో అక్కడికి వెళ్లడమే నువ్వు సాధించిన విజయమని నాగార్జున చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం నీ అవసరం నీ భార్యకు ఎంతో ఉంది కనుక ఆ దేవుడే నిన్ను ఇలా బయటకు పంపించారేమో అంటూ నాగార్జున తెలియజేశారు.ఇక నటరాజ్ మాస్టర్ గత కొద్దిరోజుల నుంచి హౌస్ లో ఉన్న సభ్యులందరినీ జంతువులతో పోలుస్తూ తీవ్ర అసహనానికి గురి చేశాడు. ఈ క్రమంలోనే మాస్టర్ గుంటనక్క అంటూ హౌస్ లో ఎవరిని సంబోధించేవారనే ఈ విషయాన్ని తెలియజేశారు.
తాను గుంటనక్క అని అన్నది రవిని అంటూ నట రాజ్ మాస్టర్ చెప్పడంతో అందుకు స్పందించిన రవి మీరు నన్నే అన్నారని నాకు ముందే తెలుసు అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ వారం మాస్టర్ ఎలిమినేట్ అవ్వడానికి కారణం అతను ఎక్కువగా హౌస్ సభ్యులతో కాకుండా ఒంటరిగా ఉండటం మైనస్ అయ్యింది. అదే విధంగా సినిమాలలో చేసినట్టు రియాలిటీ షోలో కాస్త ఓవరాక్షన్ చేస్తున్నారని నెటిజన్లు కామెంట్ చేయడం ఇతనికి మైనస్ అయిందని చెప్పవచ్చు.































