Credit Cards: క్రెడిట్ కార్డు వాడే వారు..తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!

0
292

Credit Cards ప్రస్తుతం కాలంలో క్రెడిట్ కార్డులు పొందడం పెద్ద విషయమేమి కాదు. గతంలో క్రెటిట్ కార్డులు కావాలంటే పెద్ద ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు బ్యాంకులే స్వయంగా క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తున్నాయి. కేవలం కేవైసీ ఉంటే చాలు క్రెడిట్ కార్డులను ఇస్తున్నాయి. ఇదిలా ఉంటే కార్డులను సరిగ్గా వాడకుంటే.. ఇబ్బందులు తప్పవని బ్యాంకు నిపుణులు హెచ్చరిస్తున్నారు. కార్డు చేతిలో ఉంది కదా అని ఎలాపడితే అలా గీకితే.. బ్యాంకులు మీ గుండు గీయడం ఖాయంగా కనిపిస్తోంది. 

Credit Cards: క్రెడిట్ కార్డు వాడే వారు..తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!
Credit Cards: క్రెడిట్ కార్డు వాడే వారు..తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!

క్రెడిట్ కార్డు తీసుకునే ముందు మనకు ఎలాంట ఛార్జీలు వసూలు చేస్తున్నారనే విషయాలు తెలిసి ఉండాలి. సరైన సమయంలో డబ్బును కట్టకపోతే ఎలాంటి ఫైన్లు వేస్తారనే విషయాలను కూడా తెలుసుకోవాలి. సాధారణంగా క్రెడట్ కార్డులలో ఎక్కువగా టికెట్ బుకింగ్స్ తో పాటు షాపింగ్ కు ఎక్కువగా ఉపయోగిస్తారు. క్రెడిట్ కార్డులపై ఆఫర్లు కూడా పొందుతారు. అయితే గడువులోగా బిల్లులను చెల్లించకపోతే కష్టాలు తప్పవు

Credit Cards: క్రెడిట్ కార్డు వాడే వారు..తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!
Credit Cards: క్రెడిట్ కార్డు వాడే వారు..తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!

సకాలంలో బిల్లును చెల్లించడం మంచిది. గడువులోగా కట్టకపోతే వడ్డీ మోత మోగుతోంది. వడ్డీతో పాటు ఇతర ఛార్జీలను కూడా వేసే అవకాశం ఉంది. చేతిలో కార్డ్ ఉంది కదా అని ఆర్థిక స్థోమతకు మించి షాపింగ్ చేయకూడదు. ఇలా చేస్తే మన ఆర్థిక పరిస్థితి ఛేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఒక్క నెల బిల్లులు చెల్లించకపోతే.. పెనాల్టీ ఛార్జీలతో పాలు, వడ్డీ, ఇతర జీఎస్టీ రకరకాల ఛార్జీలను వసూలు చేస్తుంటారు. ఒకవేళ షాపింగ్ చేస్తే ఈఎంఐ పెట్టుకోవడం మంచిది. 

రివార్డ్ పాయింట్లతో పాటు..

క్రెడిట్ కార్డులతో షాపింగ్ చేయడం వల్ల, బిల్లులు చెల్లించడం వల్ల రివార్డ్ పాయింట్లతో పాటు కూపన్లను పొందవచ్చు. వీటి వల్ల నెలవారీ ఖర్చులను కొంత మేర తగ్గించుకోవచ్చు. క్రెడిట్ కార్డుతో ఆన్‌లైన్‌గా లేదా ఆఫ్‌లైన్‌గా షాపింగ్ చేసినప్పుడు 10 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. పండుగ సీజన్‌లో అయితే ఈ కార్డులపై మరిన్ని ఆఫర్లుంటాయి. క్రెడిట్ కార్డ్ వాడుతున్నవారు సమయానికే కట్టితే మీ క్రెడిట్ స్కోర్ బాగుంటుంది. మీకు క్రెడిట్ స్కోర్ బాగుంటే బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తుంటాయి. లేకపోతే వ్యక్తిగత రుణాలు, వాహనరుణాలు వచ్చే అవకాశం ఉండదు.