Virataparvam 3 days Collections: వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా సాయి పల్లవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం విరాటపర్వం. ఈ సినిమా నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కి జూన్ 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే ఈ సినిమా మొదటి షో నుంచి మంచి టాక్ సంపాదించుకుంది కలెక్షన్ల పరంగా మాత్రం అనుకున్న టార్గెట్ రీచ్ కాలేకపోతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తోందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మూడు రోజులలో ప్రదర్శితం అవుతూ ఎంతమేర కలెక్షన్లను రాబట్టిందనే విషయానికి వస్తే..మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో కోటి రూపాయల షేర్స్ కూడా రాబట్టలేని ఈ సినిమా రెండవ రోజు 63 లక్షలు మూడవరోజు 56 లక్షలు మాత్రమే రాబట్టింది. ఇలా రెండు తెలుగు రాష్ట్రాలలో మూడు రోజులకు గాను. 2.09 కోట్ల షేర్ రాబట్టింది. కర్ణాటక, రెస్టాప్ ఆఫ్ భారత్, ఓవర్సీస్ అన్ని కలిపి మూడు రోజుల్లో రూ. 3.14 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది.

ముందుగా ఈ సినిమాను థియేటర్ లో కాకుండా డిజిటల్ స్క్రీన్ పై విడుదల చేయాలని భావించారు. ఇలా ఓటిటిలో విడుదలకు భారీ మొత్తంలోనే ఆఫర్ వచ్చింది. ఈ సినిమాకు సుమారు 50 కోట్ల రూపాయల వరకు ఆఫర్ వచ్చినప్పటికీ, ఈ సినిమా ఓటిటిలో కాకుండా థియేటర్లో విడుదల అయినా పెద్దగా ప్రేక్షకాదరణ నోచుకోలేకపోయింది.
ఫ్లాప్ దిశగా గా విరాటపర్వం..
ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అన్ని ఏరియాలలో కలిపి 14 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుపుతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 14.5 కోట్ల రూపాయలను రాబట్టాలి. అయితే ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 3.14 కోట్లు మాత్రమే రాబట్టింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. మొత్తంగా రూ. 11.36 కోట్లు రావాల్సి ఉంది.ఇప్పటికే ఈ సినిమా మూడు రోజుల్లో కలెక్షన్లను చూస్తే టార్గెట్ చేరుకోవడం కష్టతరంగా మారుతోంది. ఇలా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేక ఈ సినిమా కలెక్షన్ల విషయంలో నష్టాలను ఎదుర్కోవలసి వస్తుందని పలువురు భావిస్తున్నారు.































