Adire Abhi: బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్య క్రమం మొదట్లో ఎంతో మంది కమెడియన్స్ ఈ కార్యక్రమం ద్వారా పరిచయం అయి మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో అదిరే అభి ఒకరు.అదిరే అభి ఒకవైపు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే మరోవైపు జబర్దస్త్ కార్యక్రమంలో స్కిట్లు చేస్తూ ప్రేక్షకులను సందడి చేసేవారు.అయితే ప్రస్తుతం నేను జబర్దస్త్ కార్యక్రమానికి దూరం అయ్యి స్టార్ మాలో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్ కార్యక్రమంలో సందడి చేస్తున్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అదిరే అభి జబర్దస్త్ కార్యక్రమం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.జబర్దస్త్ కార్యక్రమం తనకు అదిరే అభి అని గుర్తింపు తీసుకు వచ్చిందని అదే గుర్తింపుతో నన్ను అందరు గుర్తు పడుతున్నారని ఆయన తెలిపారు.ఇకపోతే జబర్దస్త్ కార్యక్రమంలో అందరిలాగే డబుల్ మీనింగ్ డైలాగులు చెబుతూ స్క్రిప్ట్ చేయడం అదేవిధంగా ఇతరులను హింసిస్తూ వారి నుంచి ఒకరికి సంతోషం పంచాలని భావించ లేదు అందుకే అందరికన్నా భిన్నంగా స్కిట్లు చేస్తూ మంచి గుర్తింపు పొందానని అభి ఈ సందర్భంగా తెలిపారు.

ఇక తాను ఎన్నో రకాల స్కిట్లు చేశానని అయితే వాటన్నింటిలో తోలు బొమ్మల స్కిట్ చేయడం కోసం తాను ఏకంగా 90 సార్లు స్కిట్ ప్రాక్టీస్ చేశానని తెలిపారు.ఇక అదే విధంగా తాను సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక వ్యక్తి గురించి స్కిట్ చేసినప్పుడు నా లైఫ్ లో చాలా రిగ్రీట్ గా ఫీల్ అయ్యానని ఇప్పటికీ ఆ విషయం గుర్తు వస్తే తనకు తప్పు చేశాననే భావన కలుగుతుందని తెలిపారు.
ఇక హైపర్ ఆది గురించి మాట్లాడుతూ హైపర్ ఆది ఒక షార్ట్ ఫిలిం చేసి ఫేస్ బుక్ ద్వారా తనకు కామెంట్ చేశారని,అయితే తనకు ఫ్రీ అయినప్పుడు ఆ షార్ట్ ఫిలిమ్ చూసిన తర్వాత బాగా అనిపించడంతో తనని నన్ను కలవమని కామెంట్ చేశాను.ఇక ఆయన తరచూ వచ్చి మిమ్మల్ని కలవడం స్కిట్టు ప్రాక్టీస్ చేసేటప్పుడు కొన్ని జోక్ చెప్పడంతో ఓకే ఈయన చెప్పే డైలాగ్స్, జోక్స్ బాగున్నాయని చెప్పి తనని స్క్రిప్ట్ రాసివ్వమని చెప్పాను. అలా ఆది మా టీంలోకి వచ్చారు. ఇక మా టీం లో ఆది తన కామెడీతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఇక జబర్దస్త్ డైరెక్టర్స్ ఆదితో సపరేట్ టీం చేస్తామని నన్ను అడిగితే తప్పకుండా చేయమని చెప్పాను ఒకరి ఎదుగుతున్నప్పుడు మనం వారిని ప్రోత్సహించాలి.
ఆ ముగ్గురు స్కిట్ కి బలం..
ఇక ఆది తన టాలెంట్ తో పైకి ఎదిగారు ఆయన ఎదుగుదలకు నేనే కారణమని చెప్పను అంటూ అదిరే అభి ఈ సందర్భంగా ఆది గురించి తెలిపారు. ఇకపోతే సుడిగాలి సుదీర్ ఆటో రాంప్రసాద్ గెటప్ శీను ఈ ముగ్గురిని ఎప్పుడు సపరేటు టీమ్ ఏర్పాటు చేయాలని అనుకోలేదా అని ప్రశ్నించగా ఆ ముగ్గురు కలిసి ఉంటేనే ఆ స్కిట్ కి బలమని, వారిని విడదీస్తే ఆ స్ట్రెంత్ ఉండదని ఈ సందర్భంగా అభి సుధీర్ గురించి తెలిపారు. అయితే ప్రస్తుతం వీరు జబర్దస్త్ కార్యక్రమానికి దూరం కావడం అనేది పూర్తిగా వ్యక్తిగతమని అభి తెలిపారు.































