Central Minister: దేశంలో మహిళలు మగవారికి తామేమి తక్కువ కాదన్నట్లు.. ప్రతీ రంగంలోనూ దూసుకుపోతున్నారు. ఇటు రాజకీయాల్లో అయినా.. అటు ఐటీ సెక్టార్లో అయినా. అయితే గత కొన్ని సంత్సరాల నుంచి మహిళలు ప్రతీ చోట తమకు తిరుగులేదని నిరూపిస్తున్నారు.

మున్సిపాలిటీ పని నుంచి ఫ్యాక్టరీలో పని చేసే గుమస్తా వరకు వాళ్లు పనులు చేస్తున్నారు. అయితే కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ మహిళలను ఉద్దేశించి ఇన్ స్టాలో ఓ పోస్టు పెట్టారు. దాని సారాంశం ఏంటంటే.. దేశంలోని చమురు, గ్యాస్ ఇన్‌స్టాలేషన్‌లలో పనిచేసే మహిళల సహకారం ఎప్పటికీ మర్చిపోలేనిది అంటూ ప్రశంసించాడు.

ఆఫ్‌షోర్ ప్లాట్‌ఫారమ్‌లలో పనిచేసే ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ మహిళా ఉద్యోగుల చిత్రాలను ఆయన తన సోషల్ మీడియాలో పంచుకున్నాడు. కరోనా మహమ్మారి సమయంలో కూడా ఈ మహిళలు 60 నుండి 70 రోజుల పాటు డ్రిల్లింగ్ ప్లాట్‌ఫారమ్‌లపైనే ఉన్నారని మంత్రి తెలియజేశాడు.
దేశ పురోగతి మహిళలు సమాన భాగస్వాములు..
దేశ పురోగతిలో వారిని “సమాన భాగస్వాములు” అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌లో అభివర్ణించాడు. ఈ మేరకు నెట్టింట్లో ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో నెటిజన్లు కూడా మహిళలను ప్రోత్సహించే నిమిత్తం మంత్రిత్వ శాఖ చేపట్టిన కార్యక్రమాలను ప్రశంసించారు. ఇక వాళ్ల పనితనానికి మెచ్చి నెటిజన్లు కూడా సెల్యూట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మహిళలు ప్రతీ రంగంలో రాణిస్తున్నారని.. ప్రతీ ఒక్కరూ మహిళలను గౌరవించాలని కొంతమంది మహిళపై వాళ్లకు ఉన్న గౌరవాన్ని తెలియజేశారు.






























