సెకండ్ వేవ్ వచ్చిన మాదిరిగానే త్వరలో థర్డ్ వేవ్ కూడా రాబోతున్నట్లు, దాని తీవ్రత కూడా సెకండ్ వేవ్ లానే తీవ్రంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని SBI తన నివేదికలో పేర్కొంది. అయితే కరోనా థర్డ్ వేవ్ 98 రోజుల పాటు కొనసాగవచ్చని అంచనావేసింది. ఈ క్రమంలో థర్డ్ వేవ్ ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముందస్తుగా సిద్దమై ఉండాలని సూచించింది.

మరోవైపు ఈ ధర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపై అధికంగా ఉండే అవకాశం ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నేపధ్యంలో వారి ఆరోగ్యం పట్ల పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో పిల్లలకు ఇమ్యునిటీ పెంచే విధంగా వారి ఆహారపు అలవాట్లలో మార్పులు తప్పనిసరి. వేసవిలో దొరికే నేరేడు పండ్లు పిల్లలకు ఇవ్వడం చాలా మంచిది. నేరేడు పండులో విటమిన్ సి, పొటాషియం మరియు కెరోటినాయిడ్లను కలిగి ఉంటాయి.
అటు సాయంత్రం పూట రోటీ, నెయ్యి, బెల్లం రోల్ లేదా సుజీ హల్వా లేదా రాగి లడ్డూ వంటివి వారి ఆహారంలో ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇక పప్పు, నెయ్యి, బియ్యం కలిపిన ఆహారం ఇవ్వండి. అంతేకాకుండా వారు ఒత్తిడికి గురికాకుండా, అలసట చెందకుండా తగు జాగ్రతాలు పాటించండి. వీతితో పాటూ ముఖ్యంగా పిల్లలకు సరిపడ నిద్ర ఉండేలా జాగ్రత్తపడండి.
అంతేకాకుండా మాస్క్ ఎలా పెట్టుకోవాలో, ఎందుకు పెట్టుకోవాలో పెద్దవాళ్ళకి తెలిసినంతగా పిల్లలకు తెలియదు. కానీ వాళ్లు కూడా మాస్క్లు ధరిచేలా పెద్దవాళ్ళు ఒకటికి నాలుగుసార్లు చెప్పి అలవాటు చెయ్యాల్సి ఉంటుంది. వీటితో పాటూ పిల్లలలను అవసరమైతే తప్ప బయటకు తీసుకువేల్లకపోతే మంచిది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళవలసి వస్తే ఖచ్చితంగా మాస్క్ ధరించాలి. అలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టే జాగ్రత్తలు తీసుకోవాలి.































