Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీ స్టారర్ గా తెరకెక్కిన చిత్రం భీమ్లానాయక్. ఈ సినిమా ఫిబ్రవరి 25వ తేదీ విడుదలై రికార్డులను సృష్టిస్తోంది.ఇక ఈ సినిమా చూసిన అనంతరం ఇందులో రానా భార్య పాత్రలో నటించిన హీరోయిన్ ఎవరు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటూ పెద్దఎత్తున ఆమె కోసం సెర్చ్ చేస్తున్నారు.

భీమ్లానాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో నిత్యమీనన్ నటించగా, రానా భార్య పాత్రలో నటించిన హీరోయిన్ పేరు సంయుక్త మీనన్. ఈమె కూడా మలయాళం హీరోయిన్. ‘పాప్ కార్న్’ అనే మలయాళ సినిమాతో 2016లో మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

మొదటి సినిమానే ఎంతో మంచి విజయం అందుకోవడం తో ఈమె వరుస సినిమాలతో ఎంతో బిజీగా మారిపోయారు. ఇదే సమయంలో ఈమె తమిళ సినిమా అవకాశాలను కూడా దక్కించుకున్నారు.అయితే తమిళ ఇండస్ట్రీలో పెద్దగా ప్రేక్షకులను సందడి చేయ లేక పోవడంతో తిరిగి మలయాళ ఇండస్ట్రీలోనే బిజీగా మారిపోయారు. నిత్యామీనన్ తరహాలోనే రెండో హీరోయిన్ ను కూడా మలయాళీనే తీసుకోవాలని భావించడం వల్లే సంయుక్త మీనన్ కి భీమ్లానాయక్ అవకాశం వచ్చింది.
వందశాతం న్యాయం చేసింది…
ఈ సినిమాలో రానా భార్య పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. క్లైమాక్స్ లో ఆ పాత్రకు క్రూషియల్ రోల్ ఉంటుంది. ఈ పాత్రకు సంయుక్త మీనన్ వందశాతం న్యాయం చేసింది.ఇక ఈ సినిమాతో ఎంతో మంచి విజయాన్ని అందుకోవడంతో ఈమెకు తెలుగులో కూడా వరుస అవకాశాలు వస్తాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇలా తమిళ ఇండస్ట్రీలో బిజీగా ఉన్న హీరోయిన్ ఇకపై తెలుగులో కూడా బిజీ కానుందని తెలుస్తోంది.































