NTR : టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు ఎన్టీఆర్. ఈ సినిమాతో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుని తెచ్చుకోవడంతో పాటు తనకున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని మరింత పెంచుకున్నారు. అంతే కాకుండా ఈ మూవీతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా ప్రస్తుతం తారక్ తదుపరి సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు.అందులో భాగంగానే ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు.

ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కూడా మొదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ కు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే.. దేవర మూవీ ఏప్రిల్ 5న వస్తున్నట్లు ప్రకటించారు మూవీ మేకర్స్. అయితే ఈ సినిమా వాయిదా పడుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా అనుకున్నట్టుగా ఈ చిత్రం ఈ ఏడాది ఉగాది కానుకగా రావడం దాదాపు అసాధ్యం అని తెలుస్తోన్న నేపథ్యంలో ఇప్పుడు మరో కొత్త డేట్ వినిపిస్తోంది.
తాజాగా అందిన సమాచారం మేరకు ఈ సినిమా ఆగష్టులో రిలీజ్ కానున్నట్టుగా టాక్. అంతేకాదు ఈ సినిమా ఆగస్ట్ 15న అంటూ రూమర్స్ వస్తున్నాయి. అయితే ఇదే డేట్‌కు పుష్ప2కు కూడా వస్తోంది. ఒకవేళ దేవర రిలీజ్ డేట్ ఇదే అయితే ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ రెండు సినిమాలు పోటీ పడాల్సి ఉంటుంది. దేవర సడెన్‌గా ఎందుకు వాయిదా ఎందుకు పడింది అనే విషయానికి వస్తే.. ఇటీవల దేవర షూటింగ్‌లో ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోన్న హిందీ నటుడు సైఫ్ అలీఖాన్ ప్రమాదానికి గురైయ్యాడు. ఒక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణలో భాగంగా ఆయన కింద పడిపోవడంతో కాలుకు బలమైన గాయం తగిలింది.
బన్నీతో పోటీకి దిగనున్న తారక్..
దీంతో హుటా హుటిన ఆయన్ను హాస్పిటల్‌లోకి చేర్చారు దేవర టీమ్. అంతేకాదు సర్జరీ కూడా చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో షూటింగ్‌కు ప్రస్తుతం ఆయన హాజరు కాలేకపోవచ్చట. కాగా ఎన్టీఆర్ దేవర సినిమా విడుదల అయ్యే సమయానికి అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా కూడా విడుదల కానుందట. అంటే అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఇద్దరూ కూడా ఒకేసారి బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. మరి ఈ వార్తల్లో నిజా నిజాల గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఒకవేళ ఈ వార్తలు కనుక నిజం అయితే ఇద్దరిలో ఎవరు వెనక్కి తగ్గుతారో చూడాలి మరి.































