Latha Mangeshkar: సుదీర్ఘ కాలం తన గానంతో సినీ సంగీత రంగంపై చెరగని ముద్ర వేసిన లతా మంగేష్కర్ అనారోగ్యంతో ఫిబ్రవరి 6న ఉదయం ఈ లోకాన్ని విడిచి వెళ్లిన విషయం తెలిసిందే. పాటలకు మణిమకుటంగా ఎదిగి, అమృత గీతాలకు పునాదిగా ఒదిగి, దిగ్ధంత సృష్టల పాటలకు ప్రాణం పెట్టి, సంగీత తరాల అంతరాలకు వారధి కట్టి, సినీ జీవన ప్రస్థానంలో ‘భారతరత్న’మై ఖ్యాతి తెచ్చిపెట్టి సంగీత ప్రియుల్ని ఆనందాంబుధిలో ఓలలాడించిన లతా మంగేష్కర్ మరణం ప్రపంచ సంగీతానికి తీరని లోటుగా మిగిలిపోయింది.

లతా మంగేష్కర్ ఆత్మకు శాంతి చేకూరాలని ఎంతో మంది సినీ ప్రముఖులు, రాజకీయనాయకులు, గాయకులు నివాళి అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆమె చిన్న తనంలోనే ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. తండ్రి మరణంతో ఇంటి బాధ్యత అంతా ఆమెపైనే పడింది. తోబుట్టువుల బాధ్యత కూడా ఆమెపై ఉండటంతో.. వారి జీవితాలను మంచి స్థాయిలో నిలపాలని
తన జీవితాన్ని త్యాగం చేశారు.

వారి జీవితాలను ఉన్నత స్థానాలకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఆమె గురించి కూడా ఆలోచించడం మానేశారు. పెళ్లి కూడా చేసుకోకుండా కుటుంబం కోసం త్యాగం చేశారు. ఇలా ఆమె తన కుటుంబం కోసం జీవితాంతం పెళ్లి చేసుకోకుండా అవివాహితురాలిగా ఉన్నారు. ఇక ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఏ విషయమైనా చాలా గోప్యంగా ఉంచేవారు. సనిమాకు సంబంధించి విషయాలను బయటకు వచ్చేవి కానీ.. కుటుంబానికి సంబధించి విషయాలను చాలా గోప్యంగా ఉంచేవారు.
ఇదంతా ఇలా ఉంటే.. ఆమె జీవితంలో ఓ వ్యక్తిని ప్రేమించినట్లు కొన్ని ఇంగ్లీష్ కథనాల ప్రకారం తెలిసింది.
కానీ అతడు రాజ కుటుంబానికి చెందిన వాడు కావడంతో..వారి ప్రేమ పెళ్లి పీటల దాకా వెళ్లలేదట. ఆ బాధతో ఆమె ఇక జీవితాంతం ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకున్నారట. ఆ ప్రేమ కథలోకి వెళ్తే.. మాజీ క్రికెటర్ రాజ్ సింగ్ దుంగార్పర్ ని లతా మంగేష్కర్ ప్రేమించారట. ఈ విషయాన్ని ఎషియానెట్ ప్రచురించన కథనం ద్వారా తెలిసింది. లతా మంగేష్కర్ సోదరుడి ద్వారా ఆమెకు దుంగార్పర్ పరిచయం అయ్యాడు. దాంతో ఆ పరిచయం ప్రేమగా మారింది. అతడు వాళ్ల ఇంట్లో కూడా పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు. దుంగర్పార్ రాజస్తాన్ కు చెందిన రాజకుటుంబానికి చెందిన వ్యక్తి. సామాన్య కుటుంబానికి చెందిన లతాను పెళ్లి చేసుకోవడం వాళ్ల తండ్రికి, దుంగర్పూర్ పాలకుడు దివంగత మహారావల్ లక్ష్మణ్ సింగ్జీకి ఇష్టం లేకపోవడంతో.. పెళ్లి దాకా వీరి బంధం సాగలేదు. దీంతో అతడు కూడా జీవితాంతం పెళ్లి చేసుకోనని ప్రతిజ్ఞ చేశాడు. ఇక 2009లో దుంగర్పార్ అల్జీమర్స్ తో మరణించాడు.































