Pushpa-Samantha: ప్రస్తుతం పుష్ప సినిమా విడుదలై దాదాపు వారం రోజులు కావస్తున్నా.. ఆ సినిమాకు వచ్చే వసూళ్లను బట్టి చూస్తే.. రికార్డులను క్రియేట్ చేసేలా కనిపిస్తోంది. బన్నీకి ఇది మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ. మొదటి సారిగా ఐదు భాషల్లో విడుదల చేశారు.

ఇక ఈ సినిమా హిందీలో అయితే రచ్చ రేపుతోంది. విడుదలైన ప్రతీ థియేటర్ వద్ద హౌస్ ఫుల్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. కలెక్షన్లపరంగా పుష్ప ముందు ఉందనే చెప్పాలి. ఇక పుష్ప ప్రమోషన్ విషయానికి వస్తే.. బన్నీ తన ఒంటి చేత్తోనే నడిపించాడు. బన్నీతోపాటు రష్మికా కూడా కనిపించింది.
Bhalakrishana – Vijaya Shanthi: మరోసారి రిపీట్ అవుతున్న బాలయ్య విజయశాంతి కాంబినేషన్..?
ఇదిలా ఉండగా.. సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన సాంగ్ ఊ అంటావా మావా.. దీనిని సమంత కెరీర్ లో మొదటి సారి ఐటెం సాంగ్ లో కనిపించింది. దాదాపు రూ.1.5 కోట్ల పారితోషికం కూడా తీసుకున్నారు. సమంత ఈ చిత్రం కోసం ఐటెం గార్ల్‌గా మారగా, ఈ సాంగ్‌తో ఎంతో అలరించింది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు నమోదు చేసుకుంటున్న ఈ సినిమాలో తన ఐటెం సాంగ్ మిక్స్డ్ రెస్పాన్స్ ని అందుకుంటోంది. ఇదిలా ఉండగా.. సమంత ప్రమోషన్లు అంటే ఏ సినిమాకు అయినా ముందు ఉండేది.

కానీ పుష్ప సినిమా ప్రమోషన్స్ కి మాత్రం ఆమె ఎక్కడా కనిపించలేదు. దానికి ఒక కారణం తాను ఐటమ్ నంబర్ కి ప్రమోషన్ చేయలేనని మేకర్స్ కి ముందే సమంత చెప్పారట. దీని కారణం గానే ఆమె ప్రమోషన్ కు రాలేకపోయారనేది వినిపిస్తోంది. మరో కారణం కూడా వినిపిస్తోంది. అదేంటంటే.. ఆమె ప్రస్తుతం పూణేలో ఉన్నారట.. అందుకే ప్రమోషన్స్ కి హాజరు కాలేకపోయారని.. అంటున్నారు. ఇక ఆమె డైరెక్ట్ గా ప్రమోషన్ లో పాల్గొనకపోయినా.. సోషల్ మీడియాలో ఆమె ప్రమోషన్లలో పుష్ప సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.































