Uday Kiran: ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగిన కొంతమంది నటులలో ఉదయ్ కిరణ్ ఒకరు. ఈయన ఇండస్ట్రీలో మనసంతా నువ్వే, నువ్వు నేను వంటి అద్భుతమైన చిత్రాల్లో నటించి ఎంతో మంచి విజయాన్ని అందుకోవడంతో ఎంతో మంది దర్శక నిర్మాతలు ఉదయ్ కిరణ్ తో సినిమాలు చేయడానికి ఇష్టత చూపారు.

ఇలా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఉదయ్ కిరణ్ కి ఆ తరువాత మెల్లిమెల్లిగా బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాలు ఎదురయ్యాయి.అయితే అప్పటికే ఆయనకు మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మితతో నిశ్చితార్థం జరిగింది. ఇక నిశ్చితార్థం తర్వాత ఉదయ్ కిరణ్ జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయనే మాటలు పూర్తిగా అవగాహన లేని మాటలని ప్రముఖ డైరెక్టర్ మోహన్ ఆల్రక్ ఒక ఇంటర్వూలో తెలియజేశారు.

ఈ సందర్భంగా ఈ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు ఎక్కడున్నా టాలెంట్ ఉన్న వారిని ఎంకరేజ్ చేస్తారని… అల్లు రామలింగయ్య తనని ఏ విధంగా అల్లుడిని చేసుకున్నారో ఉదయ్ కిరణ్ ను కూడా తాను అల్లుడిగా చేసుకోవాలని ఎంతో ఆశ పడ్డారని మోహన్ వెల్లడించారు.
అలా చెప్పడానికి కారణం తెలియదు…
అయితే మెగాస్టార్ చిరంజీవి కూతురితో నిశ్చితార్ధం జరిగిన తరువాత ఉదయ్ కిరణ్ తనంతటతానే ఈ పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పడం వల్ల వీరి వివాహం క్యాన్సిల్ అయిందని డైరెక్టర్ మోహన్ ఈ సందర్భంగా వెల్లడించారు. అయితే ఉదయ్ కిరణ్ అలా చెప్పడానికి గల కారణాలు మాత్రం తనకు తెలియదని ఆయన తెలియజేశారు. ప్రస్తుతం డైరెక్టర్ మోహన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
































