సాధారణంగా మొక్కల నుంచి లభించే ఆహార పదార్థాలలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. ఈ ఆహార పదార్థాలలో అధికభాగం ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు సమృద్ధిగా లభిస్తాయి. ఈ విధంగా మంచి పోషక పదార్థాలను అందించే వాటిలో టెఫ్ కూడా ఒకటి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ టెఫ్ కి అధిక ప్రాధాన్యత చోటు చేసుకుంది.

ఈ విధమైనటువంటి ఆహార పదార్థాలను ఎక్కువ భాగం అథ్లెట్స్ మరియు పరిగెత్తే వాళ్ళు తీసుకుంటారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వీటిని కొనుగోలు చేసే వారి సంఖ్య అధికంగా ఉంది. గోధుమలు ,బార్లీ వంటి వాటి కన్నా ఎక్కువ భాగం టెఫ్ కొనే వారి సంఖ్య పెరుగుతుంది.
టెఫ్ లో ఎక్కువభాగం ఐరన్, మినరల్స్, క్యాల్షియం, జింక్, కాపర్, మిగిలిన ఆహార పదార్థాలతో పోలిస్తే ఈ టెఫ్ లో అధిక భాగంలో పోషక పదార్థాలు ఉంటాయి అని తేలడంతో ప్రస్తుతం ఈ విధమైన ఆహార పదార్థానికి అధిక డిమాండ్ ఏర్పడింది. ఇక తాజా అధ్యయనాల ప్రకారం టెఫ్ లో అధిక భాగం ఫ్లెవనోయిడ్స్ ఉన్నాయని నిర్ధారణ జరిగింది. ఈ విధంగా ఫ్లెవనోయిడ్స్అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తరచూ తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
ముఖ్యంగా ఈ విధమైనటువంటి ఫ్లెవనోయిడ్స్ అధికంగా కలిగిన ఆహార పదార్థాలను మధుమేహంతో బాధపడే వారు తీసుకోవటం వల్ల మధుమేహం నుంచి పూర్తిగా ఉపశమనం కలుగుతుంది.టెఫ్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉండి, ఎక్కువభాగం ఫైబర్స్ ఉండటంవల్ల ఇది మన రక్తంలోని చక్కెర స్థాయిలను పూర్తిగా నియంత్రణలో ఉంచడానికి దోహదపడతాయి. కనుక మధుమేహంతో బాధపడేవారికి గోధుమపిండి, బార్లీ కన్నా ఈ టెఫ్ ఎంతో ప్రయోజనకరమని చెప్పవచ్చు.































