అక్కినేని నాగేశ్వరరావుతో “దేవదాసు మళ్లీ పుట్టాడు” లాంటి చిత్రాన్ని తీసి చేయి కాల్చుకున్న దాసరి నారాయణరావు ఇదే సంవత్సరం కృష్ణంరాజుతో మరొక చిత్రాన్ని రూపొందించారు. 1978
విజయమాధవి కంబైన్స్, వడ్డే శోభనాద్రి నిర్మాణం, దాసరి నారాయణరావు దర్శకత్వంలో “కటకటాలరుద్రయ్య” చిత్రం విడుదలైంది.

ఈ చిత్రంలో కృష్ణంరాజు, జయసుధ, జయచిత్ర హీరో, హీరోయిన్లుగా నటించారు. “కిరాయికోటిగాడు” చిత్రంతో ప్రారంభమైన కృష్ణ, కోదండరామిరెడ్డి కాంబినేషన్ విజయాలతో దూసుకెళ్లాయి. కిరాయి కోటిగాడు, రామరాజ్యంలో భీమరాజు, కంచు కాగడా, పల్నాటి పౌరుషం, సర్దార్ కృష్ణమనాయుడు లాంటి చిత్రాలు వీరి కాంబినేషన్ లో వచ్చిన హిట్ చిత్రాలుగా పేర్కొనవచ్చు.

కృష్ణ, శ్రీదేవి, ఏ.కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో వచ్చిన చివరి చిత్రంగా “ఖైదీ రుద్రయ్య” చిత్రం గా పేర్కొనవచ్చు.1986 జయలక్ష్మి కంబైన్స్ త్రివిక్రమరావు నిర్మాణం, ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో “ఖైదీ రుద్రయ్య” చిత్రం విడుదల అయ్యింది. కృష్ణ, శ్రీదేవి, రాధ, హీరో, హీరోయిన్స్ గా నటించారు. సుమన్ బి.ఎల్.వి ప్రసాద్ కాంబినేషన్లో మూడు సినిమాలు వచ్చాయి. బందిపోటు, ఉగ్ర నేత్రుడు, పల్నాటి రుద్రయ్య.

1989 అన్నపూర్ణ సినీ చిత్ర,బి. ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో “పల్నాటి రుద్రయ్య” చిత్రం విడుదల అయ్యింది.ఈ సినిమాలో సుమన్, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా నటించారు. సుమన్-విజయశాంతి కాంబినేషన్ లో పండంటి కాపురానికి పన్నెండు సూత్రాలు, రారాజు, దర్జాదొంగ, నేటి భారతం, ఈ చరిత్ర ఇంకెన్నాళ్లు, మొండి మొగుడు పెంకి పెళ్ళాం లాంటి విజయవంతమైన చిత్రాలు రూపొందాయి…

అయితే రుద్రయ్య టైటిల్ తో వచ్చిన ఈ మూడు చిత్రాలు కటకటాల రుద్రయ్య, ఖైదీ రుద్రయ్య, పల్నాటి రుద్రయ్య ఈ మూడు చిత్రాలు బాక్స్ ఆఫీసు వద్ద విజయాన్ని సాధించాయి.































