ప్రముఖ టిక్ టాక్ స్టార్ ఆత్మహత్య.. కారణం అదే అంటున్న కుటుంబ సభ్యులు..!

0
110

టిక్ టాక్ ద్వారా ఎంతో ఫేమస్ అయి ఎంతో మంది ఫాలోవర్స్ ని సంపాదించుకున్న కొందరు టిక్ టాక్ స్టార్ లు ఇప్పటికీ అదే రేంజ్ ను కంటిన్యూ చేస్తూ యూట్యూబ్ చానల్స్ ద్వారా వినోదాన్ని పంచుతారు.కొందరికి బుల్లితెరపై నటించే అవకాశం రాగా దుర్గారావు లాంటి వారికి ఏకంగా సినిమాలలో నటించే అవకాశాన్ని కూడా కల్పించింది. ఇందులో భాగంగానే టిక్ టాక్ ద్వారా ఎంతో ఫేమస్ అయిన షేక్ రఫీ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది.

నెల్లూరు లో కెమెరామెన్ గా పనిచేస్తున్న షేక్ రఫీ అక్కడి నుంచి రోజుకు పదుల సంఖ్యలో టిక్ టాక్ ద్వారా వీడియోలను అప్లోడ్ చేస్తూ మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాడు. ఇంత ఫాలోవర్స్ ఉన్న రఫీ ప్రస్తుతం ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర సంచలనం రేపుతోంది. రఫీ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఓ అమ్మాయని తెలుస్తోంది. రఫీ స్నేహితుడైన ముస్తఫాతో మంచి స్నేహం ఏర్పడింది. అయితే ముస్తఫా ఒక అమ్మాయితో ఎంతో చనువుగా వుండే వాడు. కానీ ఆ అమ్మాయి ముస్తఫాతో కన్న రఫీ తో చనువుగా ఉండటం చూసి తట్టుకోలేకపోయిన ముస్తఫా తన స్నేహితులతో కలిసి రఫీ పై దాడిచేశాడు. గాయాలతో ఇంటికి చేరుకోగా చికిత్స నిమిత్తం అతనిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు.

రఫీ తండ్రి రియాజ్ అనంతరం ముస్తఫా పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విధంగా తన పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముస్తఫా రఫీను మరింత ఎక్కువగా వేధించేవాడు. అతని వేధింపులు రోజురోజుకి ఎక్కువవడంతో ఎంతో మనస్తాపానికి గురైన రఫీ జనవరి 22న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన కొడుకు ఆత్మహత్య చేసుకోవడానికి కేవలం ముస్తఫా వేధింపులే కారణమని రఫీ తల్లిదండ్రులు అతని పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here