శీతాకాలంలో పొడిచర్మానికి సులభంగా చెక్ పెట్టే చిట్కాలివే..?

0
340

శీతాకాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ పొడిచర్మం సమస్య వేధిస్తూ ఉంటుంది. చర్మం పొడిగా మారడం వల్ల కొందరు దురదలతో బాధ పడుతూ ఉంటారు. చలికాలంలో చాలామందికి చర్మం తెల్లగా మారడం, చర్మంపై పగుళ్లు కనిపించడం జరుగుతుంది. శరీరంలో తేమ తక్కువైనా, చర్మ సంరక్షణ పద్ధతులు పాటించకపోయినా, అనువైన దుస్తులు ధరించకపోయినా పొడిచర్మం సమస్య వేధిస్తూ ఉంటుంది. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా పొడిచర్మం సమస్యకు చెక్ పెట్టవచ్చు.

చాలామంది చలికాలంలో ఎక్కువగా నీటిని తాగరు. తక్కువగా నీటిని తాగడం వల్ల చర్మం పొడిబారుతుంది. అందువల్ల ప్రతిరోజూ ఖచ్చితంగా తగింత నీటిని తీసుకోవాలి. రిచ్ గా, ఆయిల్ బేస్ గా ఉండే మాయిశ్చరైజర్ ను ఎంచుకోవాలి. వీలైనంత వరకు ఆర్గానిక్ ఉత్పత్తులను వాడటం ద్వారా పొడిచర్మం సమస్యకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. చలికాలంలో సాధారణంగా హ్యూమిడిటీ తక్కువగా ఉంటుంది.

హ్యుమిడిఫైయర్ ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల హ్యూమిడిటీ సమస్యకు చెక్ పెట్టవచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్న కూరగాయలను తీసుకోవడం ద్వారా పొడిచర్మం సమస్యకు సులువుగా చెక్ పెట్టవచ్చు. చలికాలంలో గోరువెచ్చని నీటితో రోజూ స్నానం చేయడం ద్వారా పొడి చర్మం సమస్యకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. చలికాలంలో కెమికల్స్ తో తయారైన సబ్బులను వినియోగించక పోవడమే మంచిది.

ప్రతిరోజూ దానిమ్మ పండు తినడం లేదా దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల పొడిచర్మం సమస్యకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. సాల్మన్, ఆలివ్ ఆయిల్, వాల్నట్స్ తీసుకోవడం ద్వారా శరీరానికి కావాల్సినంత ఓమేగా 3 లభించి చర్మం మృదువుగా మారే అవకాశం ఉంటుంది.