బుల్లితెరపై మరి కొద్ది రోజులలో ప్రసారం కాబోయే బిగ్ బాస్ సీజన్ 5 గురించి రోజుకొక వార్త సోషల్ మీడియాలో వినబడుతున్నాయి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ కంటెస్టెంట్ వీళ్ళే అంటూ కొందరి పేర్లు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా బ్రహ్మానందం కొడుకు బిగ్ బాస్ కార్యక్రమంలోకి ఎంట్రీ ఇస్తున్నాడని తెలుస్తోంది.అయితే నిజంగానే బ్రహ్మానందం గారి అబ్బాయి బిగ్ బాస్ లోకి వస్తున్నారు అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే.

బ్రహ్మానందం కొడుకు అంటే అతడు సినిమాలో బ్రహ్మానందం కొడుకు పాత్రలో అల్లరి చేసిన కుర్రాడి పేరు దీపక్ సరోజ్. ప్రస్తుతం చదువులను పూర్తిచేసుకున్న యువకుడు సినిమా ఆఫర్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలోనే ఇతనికి బిగ్ బాస్ ఆఫర్ రావడంతో బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా అతడి సినిమాలు బ్రహ్మానందం కొడుకు పాత్రలు ఎంతో అద్భుతంగా నటించాడు.
దీపక్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సుమారు 20 సినిమాల వరకు నటించి ఆ తర్వాత చదువుల నిమిత్తం ఇండస్ట్రీకి దూరం అయ్యాడు.ఈ క్రమంలోనే 2014వ సంవత్సరంలో మిణుగురులు సినిమాలు నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో నటించినందుకు గాను దీపక్ కు నేషనల్ అవార్డు కూడా వచ్చింది.
ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైన దీపక్ ప్రస్తుతం హీరోగా ఎంట్రీ ఇవ్వాలని ఎంతో ఆశ పడుతున్నారు. ఈ క్రమంలోనే ఇతనికి బిగ్ బాస్ ఆఫర్ రావడంతో బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించవచ్చని బిగ్ బాస్ కార్యక్రమంలోకి అడుగు పెడుతున్నారు. మరి బిగ్ బాస్ ద్వారా దీపక్ ఎలాంటి గుర్తింపు సంపాదించుకుంటారో వేచి చూడాలి. ప్రస్తుతం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ కూడా క్వారంటైన్ లో ఉన్న సంగతి మనకు తెలిసిందే.































