Pooja Hegde: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే గురించి మనందరికీ తెలిసిందే. మొన్నటి వరకు వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోయిన పూజా హెగ్డే ఈ మధ్యకాలంలో కాస్త స్లో అయిందని చెప్పవచ్చు. అందుకు గల కారణం ఆమె నటించిన సినిమాలు అన్నీ కూడా వరుసగా ఫ్లాప్ అవడం. ఇకపోతే పూజా హెగ్డే చివరగా గత ఏడాది విడుదలైన కిసికా భాయ్ కిసికా జాన్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరవాలేదు అనిపించింది. ఈ సినిమా కంటే ముందు విడుదలైన బీస్ట్, రాధేశ్యామ్, ఆచార్యా సినిమాలు ఫ్లాప్ అవడంతో పూజా హెగ్డే కెరియర్ కాస్త డల్ అయ్యింది.దాంతో ఐరన్ లెగ్ అంటూ పూజ హెగ్డే ని విమర్శించడం మొదలుపెట్టారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం ఖాళీగానే ఉంటోంది.

అప్పుడప్పుడు పలు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తూ ఉంటుంది పూజా హెగ్డే. అయితే సినిమా అవకాశాలు లేకపోయినప్పటికీ ఈ ముద్దుగుమ్మ అందం మాత్రం చెక్కు చెదరడం లేదు. ఇది ఇలా ఉంటే తాజాగా పూజ హెగ్డే సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో పాటు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
అందాలను ఆరబోస్తున్న పూజా హెగ్డే…
లంగా వోణీలో చాలా పద్ధతిగా కనిపిస్తూనే అందాలను ఆరబోస్తూ పిచ్చెక్కిస్తోంది పూజ. తన నడుము అందాలను చూపిస్తూనే మత్తెక్కించే చూపులతో మైమరిపిస్తోంది. పింక్ కలర్ లెహంగా గ్రీన్ కలర్ బ్లౌజ్ ధరించి ట్రెడిషనల్ లుక్ లో ఆకట్టుకుంటోంది ఈ బ్యూటీ. అయితే ప్రస్తుతం తన అమ్మమ్మ ఊర్లో ఉన్న పూజా హెగ్డే అక్కడ పల్లెటూర్లలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఎప్పటికప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తోంది. ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. హాఫ్ శారీలో పూజా హెగ్డే ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఫోటోలను చూసిన అభిమానులు సినిమా అవకాశాలు లేకపోయినప్పటికీ పూజ అందం ఏ మాత్రం చెక్కు చదరడం లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎక్సలెంట్,సూపర్,ఆసమ్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు.





























