సమంత విడాకుల వ్యవహారాన్ని మరిచిపోయి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సమాజంలో జరిగే విషయాలపై స్పందిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే అందుకు సంబంధించిన పోస్ట్ లు కూడా పెట్టింది. ఇటీవలే అమ్మాయిల పెళ్లిళ్ల గురించి చేసిన పోస్టు ఎంత వైరల్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. ఆ తరువాత కూడా పలు ఆసక్తికర పోస్టులను చేసింది. అయితే సమంత తాజాగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

అయితే సమంత చేసిన పోస్ట్ వెంటనే డిలీట్ చేసినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇంతకీ సమంత ఏం పోస్ట్ చేసిందంటే ఇటీవలే తెలంగాణలో గే కపుల్ పెళ్లికి సిద్ధమైన విషయం అందరికి తెలిసిందే. వీరికి సపోర్ట్ చేస్తూ సమంత పోస్ట్ చేసింది గే మ్యారేజ్ అధికారికమే అంటూ సుప్రీమ్ కోర్టు సైతం చెప్పింది. కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మొదటిసారిగా తెలంగాణలో గే కపుల్ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు రెండు రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి.
ఆ గే కపుల్ గత ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారంటూ, ఇరువురి పెద్దల సమక్షంలో పెద్దల అంగీకారంతో ఈ పెళ్లి డిసెంబర్ లో చేసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే వారు ఒక వార్తా పత్రికకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఈ వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. సమాజం ఏమనుకుంటుందో అన్న విషయాన్ని పక్కన పెట్టి వారు అనుకున్నది చేస్తున్నారు.వాళ్లిద్దరినీ ట్యాగ్ చేస్తూ సమంత అభినందనలు తెలిపింది.
ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 377ను సుప్రీం కోర్టు తొలగించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మొదటి స్వలింగ సంపర్క వివాహం ఇదేనని ప్రచారం జరుగుతుంది.ఈ విషయంఫై సినీ ప్రముఖులు ఎవరూ స్పందించకపోగా సమంత మాత్రం ఈ విషయంపై స్పందించింది.గే మ్యారేజ్‌కు సపోర్ట్ చేస్తూ దానికి సంబంధించిన పోస్ట్ షేర్ చేయడమే కామెంట్ కూడా చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
































