అలీ తొలినాళ్లల్లో తన కామెడీతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం కూడా చిన్నా చితక సినిమాల్లో తన కామెడీతో మెప్పిస్తున్నారు. అంతే కాంకుడా ప్రస్తుతం ఈటీవీలో ప్రసారం అయ్యే ‘అలీతో సరదాగా’ లో హెస్ట్ గా.. యాంకర్ చేస్తూ తన కామెడీ.. పంచులతో ప్రతీ ఒక్కరిని నవ్విస్తున్నారు. ప్రతీ వారం ఎవరో ఒకరు సెలబ్రిటీని తీసుకొచ్చి వాళ్లతో మాట్లాడుతూ.. వ్యక్తిగత వివరాలను రాబడుతూ.. నవ్వుతూ ప్రోగ్రాంను నడిపిస్తున్నారు.

ఈ మధ్య పెద్ద పెద్ద సెలబ్రిటీలు తమ ఇంటికి సంబంధించిన విషయాలను.. వస్తువులను హోంటూర్ అంటూ చూపిస్తున్న విషయం తెలిసిందే. తమ యూట్యూబ్ ఛానల్ లో పోస్టు చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు.
ఇదే కోవలో మంచు లక్ష్మి కూడా చేరారు. ఇటీవల తన ఇంటి విశేషాలను తెలియజేస్తూ వీడియోలు తీసి పోస్టు చేశారు. ఆ వీడియో తెగ వైరల్ అయిన విషయం కూడా తెలిసిందే. తాజాగా కమెడియన్ అలీ భార్య జుబేదా తన ఇంటికి సంబంధించి హోమ్ టూర్ తీశారు. ప్రస్తుతం ఆ వీడియో తెగ వైరల్ అయింది. దీనిలో అలీకి సంబంధించిన ఎన్నో విషయాలను ఆమె తెలిపారు.
అలీ గెలుచుకున్న అవార్డులు, రివార్డులు చూపించగా.. అలీ వాటిని వివరించారు. ఇక ఇంట్లో ఉన్న ప్రతీ ఏరియాను చూస్తుంటే ఎంతో అందంగా కనిపించాయి. అందులో ని డైనింగ్ ఏరియా, స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటివి ఆధునాత సౌకర్యాలతో ఉన్నాయి. ఇవి ప్రతీ ఒక్కరినీ ఆకట్టకుంటున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.































