అనుకున్నదే జరుగుతోంది. పాతికేళ్లకు పైగా ప్రస్థానం మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ (మా) రెండుగా చలీపోయేందుకు సమయం ఆసన్నమైంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఎన్నికలే దానికి ఆజ్యం పోసినట్లు స్ఫష్టంగా అర్థం అవుతోంది. ఉదయం నుంచి వస్తున్న వార్తలు ప్రకాశ్ రాజ్ ప్రెస్ మీట్ తర్వాత నిజం చేశాయి. తాజాగా ప్రకాష్ రాజ్ నుంచి గెలిచిన 11 మంది ప్యానల్ సభ్యులు రాజీనామా సమర్పించారు.

మంచు విష్ణుకు ఇబ్బందులకు ఉండకూడదనే కారణంతో తమ సభ్యులు రాజీనామా చేశారని చెప్పుకొచ్చాడు ప్రకాష్ రాజ్. ఏ సంస్థ అయినా ముందుకు వెళ్లాలంటే.. అందరి అభిప్రాయాలు, సలహాలు సూచలను తీసుకుంటూ వెళ్లాలి. కానీ మాలో ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదు అన్నారు ప్రకాష్ రాజ్.
మా ప్యానల్ నుంచి కొందరు.. విష్ణు ప్యానల్ నుంచి కొందరు గెలుపొందడంలో ప్రశ్నించే విషయంలో బేదాభిప్రాయాలు వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకనే తాము మా కు దూరంగా ఉండాలనే నిర్ణయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకాష్ రాజ్ పేర్కొన్నాడు. ఇప్పుడు విష్ణు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మాలో ఎలాంటి అభివృద్ధి జరక్కపోయినా, సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోయినా ప్రశ్నిస్తామంటూ చెప్పుకొచ్చాడు.
ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే.. మంచు విష్ణు గెలవగానే టాలీవుడ్ బాస్ ఎవరంటే.. మోహన్ బాబు అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి.. కరోనా సమయంలో కూడా ఆక్సిజన్ ప్లాంట్ లను సమకూర్చిన చిరంజీవి కూడా ఈ విషయంలో బాధపడినట్లు తెలుస్తోంది. ఇటు అభిమానులకు కూడా ఇది రుచించలేదు. దీంతో చిరంజీవి ఓడిపోయినట్లుగానే అందరు వ్యవహరిస్తున్నారు. దీంతో వాళ్లు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక చివరికి మెగస్టార్ చిరంజీవి సపోర్ట్ తోనే ప్రకాశ్ రాజ్ వేరే అసోసియేషన్ పెడుతున్నట్లు తెసుస్తోంది.




























