నాగూర్ బాబు.. ఓ సుప్రసిద్ధ గాయకుడు మాత్రమే కాకుండా డబ్బింగ్ కళాకారుడు కూడా. ఈయనను మనో అనే పేరుతో ముద్దుగా పిలుస్తారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ఏకంగా 25 వేలకు పైగా పాటలు పాడాడు మనో. ఈయన సత్తెనపల్లి లోని ఓ ముస్లిం కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లి పేరు షహీదా, తండ్రి పేరు రసూల్. మనో తండ్రి ఆలిండియా రేడియోలో పనిచేసేవారు. ఇక ఈయన చిన్నప్పటి నుండి నేదునూరి కృష్ణమూర్తి దగ్గర కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు. మనో గాయకుడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం కాకముందే నీడ అనే చిత్రంలో బాలనటుడిగా కూడా కనిపించాడు. ఆ తర్వాత పాటలు పాడే సమయంలో ఇళయరాజా నాగూర్ బాబు గా ఉన్న తన పేరును మనోగా మార్చాడు. ఈయన తబలా వాద్యకారుడు కూడా. తనని సంగీత దర్శకులు చక్రవర్తి దగ్గర చేరుద్దామని చెన్నైతీసుకువెళ్లగా అక్కడ ఆయన ప్రతిభను గుర్తించిన చక్రవర్తి మనోను అక్కడే సహాయకుడిగా ఉండిపొమ్మన్నాడు. దింతో చక్రవర్తిగారి దగ్గర పనిచేయడం ద్వారా నేపథ్యగానంలో మెళకువలు పొందగలిగాడు.

తమిళంలో నాగూర్‌ బాబు గా, తెలుగు లో మనో గా, ఆయన సుప్రసిద్ధులు. మనో గాయకుడిగా మొదటి పాట మురళీ మోహన్ జయభేరి పతాకం మీద తీసిన కర్పూరదీపం అనే సినిమా లో పాడారు. అలాగే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు తెలుగు చిత్రాల కోసం ఆయనకు గాత్రదానం చేసి ఆయన మెప్పు కూడా పొందాడు. ప్రస్తుతం తెలుగు బుల్లితెర పై పలు సంగీత కార్యక్రమాలకు జడ్జ్ గా కూడా పాల్గొంటున్నాడు. మనో పేరుకు ముస్లిం సంప్రదాయమైనా.. తాము అన్ని మతాలను గౌరవిస్తాం అని, రంజాన్‌ పండుగను ఎంత ఘనంగా చేసుకుంటామో దీపావళి, క్రిస్‌మస్ పండుగలను కూడా అంతే గొప్పగా జరుపుకొంటాం అంటూ ఉంటారు. అంతే కాకుండా మేం ప్రతి సంవత్సరం తిరుమలకు కాలినడకన వెళతామని. అంతేకాకుండా శబరిమలైకి వెళ్లి అయప్పస్వామిని కూడా దర్శించుకుంటామని చెప్తుంటారు. ఇక ఈయన భార్య పేరు జమీలా. మనో కి 19 ఏళ్ళ వయసులో ఉండగానే 1985 లో పెళ్లి జరిగింది. జమీలా ది ఆంధ్రలోని తెనాలి. ఆ ఊళ్ళోనే సంప్రదాయ ముస్లిం పద్ధతిలో వీరిద్దరి వివాహం జరిగింది. అది 1985 జూన్ 9వ తేది. మనోకి జీవితంలో అది మరపురాని రోజు. ఎందుకంటే వారి వివాహానికి సాక్షాత్తూ వీరి గురువు కె.చక్రవర్తి గారు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చి సాక్షి సంతకాలు చేశారు.

వీరిద్దరికి మొత్తం ముగ్గురు పిల్లలు. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వీరికి కూడా సినిమా రంగంలో రానించాలని అభిరుచి ఎక్కువ. పెద్ద అబ్బాయి షకీర్ తమిళ సినిమాల్లో కొన్ని పాత్రలలో నటిస్తుండగా, ఇక.. చిన్న కుమారుడు రతేశ్ కూడా సినిమాల్లోకి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక అమ్మాయి సోఫియా కు పాడడం మీద ఆసక్తి ఎక్కువ. ఇప్పటికే ఆవిడా అమెరికా లో ‘స్వరాభిషేకం’ కార్యక్రమంలో కూడా పాటలు పాడింది. ఇదత్త ఒక పక్కన పెడితే మనోకి బిజినెస్ రంగంలోనూ చెయ్యితిరిగింది. రియల్ ఎస్టేట్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. వీటి లావాదేవీల ద్వారా దాదాపు 500 కోట్ల రూపాయలు సంపాందించి ఉంటారని సినీ ప్రముఖలు చెబుతూ ఉంటారు. ఈ రకంగా ఒకవైపు సినిమా రంగంలో రాణిస్తూనే మరోవైపు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం మంచి లాభాలను ఆర్జిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here