టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో పాపులర్ అయిన వారిలో సింగర్ సునీత ఒకరు. ఈమె తన మధురమైన గానంతో ఎన్నో పాటలు పాడి ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకుంది.ఈ క్రమంలోనే ఎన్నో సంవత్సరాల నుంచి ఒంటరి జీవితం గడుపుతున్న సునీత తన ఒంటరి జీవితానికి గుడ్ బై చెబుతూ తన జీవితంలోకి తన స్నేహితుడు అయినటువంటి రామ్ వీరపనేనిని రెండవ పెళ్లి చేసుకుని ఆహ్వానించింది.

ఈ క్రమంలోనే సింగర్ సునీత పై ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. పెళ్లీడుకొచ్చిన పిల్లలను పెట్టుకుని తాను రెండో పెళ్లి చేసుకోవడం ఏంటి అంటూ అప్పట్లో పెద్దఎత్తున వీరిపై విమర్శలు కురిపించారు. అయితే సునీత తన జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లను పడిన కష్టాలను చూస్తే మాత్రం ఆమె నిర్ణయం సరైనదేనని చెప్పవచ్చు. అందరి ఆడ పిల్లలలాగే తను కూడా తన జీవితం అలా ఉండాలి, ఇలా ఉండాలని ఎన్నో కలలు కన్నానని అయితే ఆ కలలన్నీ ఆవిరైపోయాయని ఎన్నో సందర్భాలలో తెలియజేశారు.

జీవితంపై విరక్తి వచ్చి బతుకుతున్న నాకు రామ్ జీవితం పై కొత్త ఆశలను కల్పించాడని అతడు నాకు ప్రపోజ్ చేసినప్పుడు అతని మాటల్లో నిజాయితీ కనిపించిందని, అందుకే తనని పెళ్లి చేసుకున్నానని సునీత తెలియజేశారు. రామ్ ని రెండవ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తనపై విమర్శలు ఏ మాత్రం తగ్గడం లేదని, కేవలం అతని వెనక ఉన్న ఆస్తిని, డబ్బును చూసి పెళ్లి చేసుకున్నాను అంటూ ఎంతో మంది విమర్శలు చేశారు.

నిజానికి రామ్ కి ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయో, అతని లావాదేవీలు తనకు తెలియదని, ఇలా తెలియదని చెప్పినా కూడా ఎవరు నమ్మరనే విషయం తనకు తెలుసని ఈ సందర్భంగా సునీత రామ్ ఆస్తుల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఏది ఏమైనా ఎన్నో బాధలు, అవమానాలు పడిన తర్వాత సునీత రెండవ పెళ్లి చేసుకుని ప్రస్తుతం తన జీవితంలో సంతోషంగా ఉందని మాత్రం తెలుస్తోంది.
































