వర్షం సినిమాలో ప్రభాస్ పక్కన నటించిన ఈ బుడతడు ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?

0
394

చిన్నప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్ లుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వారి స్టైల్లో ముద్దు ముద్దుగా డైలాగులు చెబుతూ మనల్ని అలరించిన ఎంతోమంది బాల నటులు పెద్దయ్యాక స్టార్ హీరోలు గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలా హీరో తరుణ్ కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఒకప్పుడు స్టార్ హీరో హోదా లో ఎన్నో హిట్ సినిమాలను తీసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే వర్షం సినిమాలో ప్రభాస్ మేనల్లుడు పాత్రలో నటించిన బాబు మీ అందరికీ గుర్తుండే ఉంటాడు..

ఈ సినిమాకంటే ముందే నాగార్జున గారు నటించిన సంతోషం సినిమాలో అతని కొడుకుగా ముద్దుగా బొద్దుగా ఇన్నోసెంట్ ఫేస్ తో డైలాగులు చెప్తూ మనల్ని అలరించాడు ఈ బుడతడు.. అయితే అసలు ఎవరు ఈ పిల్లవాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, అతని పేరేంటి ఇలాంటి విషయాలన్నీ కూడా ఒకసారి మనం మాట్లాడుకుంటే.. ఇతడి పేరు అక్షయ్ బచ్చు. ఇతను బాల నటుడి గా తన కెరీర్ ని మొదలు పెట్టాడు తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ఎన్నో సినిమాల్లో, సీరియల్స్ లో, అడ్వర్టైజ్మెంట్ లో కూడా నటించాడు.

తెలుగు లో పూరి జగన్నాథ్ తీసిన బ్లాక్ బాస్టర్ మూవీ పోకిరిని హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా వాంటెడ్ అనే పేరుతో రీమేక్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే.. అందులో హీరోయిన్ ఆయేషా టాకియా తమ్ముడి పాత్రలో నటించాడు మన అక్షయ్. ఇతను ప్రస్తుతం ముంబైలోని నివసిస్తున్నాడు. ముంబైలోని ఒక కాస్టింగ్ ఏజెన్సీలో ఉద్యోగం కూడా చేస్తున్నాడు.

అక్షయ్ కి నటన మీద ఎంత ఆసక్తి ఉందో అతని మనం చిన్నప్పటి నుంచే చూస్తున్నాము..అంతేకాదు ఇతను పాటలు కూడా బాగా పాడతాడట. ఇక ఇప్పుడు సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందిన తర్వాత అతను తన యాక్టింగ్ కి సంబంధించిన వీడియోలు అలాగే తన పాటలకు సంబంధించిన వీడియోలు అన్నీకూడా తన ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలో సైట్స్ లో అప్లోడ్ చేస్తూ ఉంటాడట..

ఇక అక్షయ్ వాంటెడ్ సినిమాలోనే కాదు అంజనీ, పరదేశి, సంతోషం, వర్షం లాంటి సినిమాల్లో అలాగే దియా ఔర్ బాతీ హమ్ అనే సీరియల్ లో కూడా నటించాడు. అంతే కాదు ఇతను ప్రజెంట్ ముంబయిలో నివసిస్తున్న కూడా ఇతను హోమ్ టౌన్ మాత్రం ఆంధ్రప్రదేశ్. సో మిగతా చైల్డ్ ఆర్టిస్ట్ లాగానే అక్షయ్ కూడా మళ్ళీ హీరోగా గానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కానీ మళ్ళీ తెలుగు సినిమాల్లోకి అడుగు పెడతాడేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here