ఆ రోజుల్లో దర్శకులు దాసరి-రాఘవేంద్రరావుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగిందా.?!

0
580

1991 తర్వాత USSR భౌగోళిక విచ్చిన్నం తర్వాత ప్రపంచం కాస్త ద్విధ్రువ ప్రపంచంగా ఆవిర్భవించింది. ఒకవైపు అమెరికా మరోవైపు రష్యా ప్రపంచ దేశాలను ఉద్రిక్త వాతావరణానికి గురిచేశాయి. ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ, ఆర్థిక విషయాల్లో పరోక్షంగా కలుగజేసుకున్నాయి. దీనినే మనం ప్రచ్ఛన్నయుద్ధం గా చెప్పుకోవచ్చు.

అయితే తెలుగు సినీ పరిశ్రమలో 1970 చివరి దశకం అలాగే 1980 ప్రారంభ దశకం వచ్చేసరికి దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావులు తెలుగు సినీ పరిశ్రమలో ద్విదృవాలుగా ఆవిర్భవించారా అనిపిస్తుంది.. ఒకరు ఎన్.టి.రామారావుతో సినిమా చేసి హిట్ కొడితే మరొకరు అక్కినేనితో సూపర్ హిట్టు కొట్టేవారు. ఇలా ఒకరిని మించి ఒకరు సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీశారు. ఒకసారి ఎన్టీ రామారావు మూవీ ఆర్డర్ ని చూస్తే…. 1976లో దాసరి నారాయణరావు ఎన్టీ రామారావు, జమున, మంజుల తో మనుషులంతా ఒకటే సినిమా సూపర్ హిట్ అయ్యింది.

ఆ తర్వాత 1977లో కె.రాఘవేంద్రరావు ఎన్టీ రామారావు, జయప్రద, జయసుధ లతో అడవిరాముడు సినిమా తీశాడు. అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత 1979లో ఎన్టీరామారావు,శ్రీదేవి కాంబినేషన్ లో వేటగాడు తీసి సూపర్ హిట్ చేశారు. దాసరి నారాయణ రావు 1980లో మళ్లీ ఎన్.టి.రామారావు, శ్రీదేవిల తో సర్దార్ పాపారాయుడు సినిమా తీశారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇదే సంవత్సరంలో కె.రాఘవేంద్రరావు ఎన్టీరామారావు శ్రీదేవి కాంబినేషన్ లో గజదొంగ సినిమా తీసి హిట్ చేశారు. మళ్లీ కే.రాఘవేంద్రరావు 1981లో ఎన్టీ రామారావు, శ్రీదేవిలతో కొండవీటి సింహం తీశారు. ఆ తర్వాత 1982లో దాసరి నారాయణ రావు ఎన్టీ రామారావు, శ్రీదేవి లతో బెబ్బులిపులి సినిమా తీసి బ్లాక్ బస్టర్ చేశారు. ఇదే సంవత్సరంలో కె.రాఘవేంద్రరావు ఎన్టీ రామారావు శ్రీదేవి లతో జస్టిస్ చౌదరి సినిమా తీశారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here