మనలో చాలామంది సులభంగా డబ్బు సంపాదించాలని భావిస్తూ ఉంటారు. అయితే డబ్బు సంపాదించడానికి చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నా మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ రూపంలో, సిప్ టాపప్ రూపంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. అయితే ఇన్వెస్ట్‌మెంట్ నిపుణులు మాత్రం సిప్ తో పోలిస్తే సిప్ టాపప్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదని చెబుతున్నారు.

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేయడం ద్వారా 10 శాతం నుంచి 12 శాతం వరకు రాబడి పొందే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు 30 సంవత్సరాల వ్యక్తి 20 సంవత్సరాల పాటు సిప్ ను కొనసాగిస్తే నెలకు 10,000 రూపాయల చొప్పున సిప్ చేస్తే 24 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసినందుకు ఏకంగా 76 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. పెట్టుబడితో పోల్చి చూస్తే ఏకంగా 52.5 లక్షల రూపాయలు ఎక్కువ మొత్తం ఆదాయం పొందే ఛాన్స్ ఉంటుంది.

అయితే సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల బాగానే లాభాలు వచ్చినా సిప్ టాపప్ ఆప్షన్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే 20 సంవత్సరాలకు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏకంగా కోటీ 60 లక్షల రూపాయలు పొందవచ్చు. అయితే సిప్ టాపప్ లో ప్రతి నెల 1,000 రూపాయలు ఇన్వెస్ట్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. మొత్తం ఇన్వెస్ట్ మెంట్ 68 లక్షలు కాగా ఏకంగా 94 లక్షలు రాబడి రూపంలో మనం పొందే అవకాశం ఉంటుంది.

రెండు ఆప్షన్లు బెస్ట్ అయినప్పటికీ ఆదాయాన్ని, ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని ఇన్వెస్ట్ చేయడం మంచిది. స్థిర ఆదాయం ఉన్నవాళ్లు సిప్ ఆప్షన్ ను, స్థిర ఆదాయం లేనివాళ్లు సిప్ టాపప్ ఆప్షన్ ను ఎంచుకుంటే ప్రయోజనం కలుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here