Uncategorized
Toyota innova and land cruiser in fields by punjab farmers
Published
7 years agoon
By
telugudeskToyota innova and land cruiser in fields by punjab farmers
Top Telugu website in the world | Telugu Gossips, Breaking News Headlines, Health news, Latest Andhra News, Telangana News, India News, World News – Telugudesk.net
You may like
Uncategorized
అరకు ఎంపీగా గెలిపిస్తే.. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా! : కొత్తపల్లి గీత
Published
6 months agoon
3 April 2024By
lakshanaకొత్తపల్లి గీత.. ఈ పేరు తెలుగు రాష్ట్రాలకు కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. ప్రభుత్వాధికారిగా.. రాజకీయవేత్తగా అందరికీ సుపరిచితమే.! తూర్పుగోదావరి జిల్లా తిమ్మాపురం ప్రాంతానికి చెందిన గీత ఎంఏ వరకు చదివి గ్రూప్-01 అధికారిగా సేవలందించారు. ప్రజాసేవ చేయడమే లక్ష్యంగా ఉద్యోగాన్ని వదిలేసి 2013లో వైసీపీలో చేరారు. ఆ మరుసటి ఏడాదే 2014లో జరిగిన ఎన్నికల్లో అరకు ఎంపీగా పోటీచేసి 91,398 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గెలిచిన మరుసటి రోజు నుంచే అరుకును అభివృద్ధి బాటలో నడిపించి నియోజకవర్గానికి కావాల్సిన నిధులు, అభివృద్ధి అంటే ఏంటో చూపించారు.
నాడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో వచ్చిన కొన్ని విబేధాలతో బయటికొచ్చి.. ఎంపీగానే కొనసాగుతూ 2018లో స్వయంగా జనజాగృతి పార్టీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గిరిజన సామాజిక వర్గాన్నే కాదు.. యావత్ రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడిన వారిని అభివృద్ధి బాటలో నడిపించాలనే తపనతో ముందుకొచ్చారు కానీ.. పార్టీ అంటే డబ్బులతో ముడిపడి ఉంటుందని ఆలస్యంగా తెలుసుకుని 2019లో బీజేపీలో విలీనం చేయడం జరిగింది. నాటి నుంచి బీజేపీ నేతగా కొనసాగుతూ నియోజకవర్గానికి తన వంతుగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ వచ్చారు. ఆమె కృషికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పదవి కూడా దక్కింది. అంతేకాదు.. అరకు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలనే లక్ష్యంతో ఉన్న గీతను సీటు దక్కేలా చేసింది. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలోనూ కొత్తపల్లి దూసుకెళ్తున్నారు.
గిరిజనాభివృద్ధి అనేది నరేంద్ర మోదీతోనే సాధ్యమని గీత గట్టిగా నమ్ముతున్నట్లు తెలిపారు. అరకులో ఇప్పుడున్న పరిస్థితిని పూర్తిగా మార్చడానికి తాను కంకణం కట్టుకున్నానన్నారు. ఎందుకంటే గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీదని.. గిరిజనులు అంటే మోదీకి ప్రేమ అని.. దీంతో కచ్చితంగా నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో ప్రతి ఒక్క గిరిజన బిడ్డను బాగుచేస్తామని.. అది కూటమి గెలిస్తే.. కేంద్రంలో మోదీ వస్తేనే జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక అరకు ఎంపీగా గెలిస్తే.. విద్య, వైద్యం, సొంతింటి కల, యువతను బాగు చేయడం ఈ నాలుగే టార్గెట్‌గా ముందుకెళ్తున్నట్లు తెలిపారు గీత. యువత అంటే ఎంతసేపూ జెండాలు పట్టుకోవడానికి తప్ప.. వారికి ఉద్యోగాలు, ఇండస్ట్రీలు తీసుకొచ్చిన పాపాన వైసీపీ పోలేదన్నారు.
ఇప్పటికే తాను ఎంపీగా పనిచేసినంతకాలం అభివృద్ధికై సాయశక్తులా కృషి చేశానని.. మరోసారి గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చేతల్లో చూపిస్తామంటున్నారు. తనకు ఎలాంటి ఆస్తులు, అంతస్థులు, గెస్ట్ హౌస్‌లు లేవని ప్రజలే తనకు పెద్ద ఆస్తి అని.. ఎంపీగా గెలిస్తే నియోజకవర్గానికి కావాల్సిన అభివృద్ధి పనులు పనిచేయడానికే తాను ముందుంటానని చెబుతున్నారు. దీంతోపాటు ఇల్లీగల్ మైన్స్ అనేది లేకుండా చేస్తామని మాటిచ్చారు. గిరిజన ప్రాంతాల్లో మైనింగ్ చేయకుండా ఉండటానికి తనవంతుగా యుద్ధం చేస్తానని.. చట్ట ప్రకారమే చేయడానికి మాత్రమే వీలుకల్పిస్తామని కొత్తపల్లి క్లియర్ కట్‌గా చెబుతున్నారు.ప్రధాని నరేంద్ర మోదీ మహిళ, గిరిజనులను అభివృద్ధి చేయాలనే తపనతో ఉన్న మనిషి. అరకులోని ప్రజల జీవన విధానం మార్చి.. ఆ ప్రాంతాన్ని అట్రాక్టివ్ టూరిజం ప్రాంతంగానే కాకుండా.. ప్రతి కుటుంబానికి ఉద్యోగం.. గిరిజనులను లక్షాధికారి చేయడమే లక్ష్యంగా మోదీ ఉన్నారు. మిగిలిన ప్రాంతాల్లో ఎలాంటి సౌకర్యాలున్నాయో అరకులో కూడా అలాంటివే ఏర్పాటు చేసి.. విదేశీ విద్యకు గిరిజనులను పంపి.. ఇవేకాదు సమగ్రాభివృద్ధికి అహర్నిశలు కృషి చేయడానికి ప్రధాని సిద్ధంగా ఉన్నారని గీత చెబుతున్నారు.
మరీ ముఖ్యంగా.. అరకు ప్రాంతానికి వ్యాపారం పేరిట వచ్చి కొందరు అమ్మాయిలను ట్రాఫికింగ్ చేయడం.. మరికొందరు పెళ్లిళ్లు చేసుకొని భూములు రాయించుకుంటున్న వారిపై ఉక్కుపాదం మోపడానికి తన వంతు ప్రయాత్నాలు చేస్తానని కొత్తపల్లి గీత హామీ ఇచ్చారు. వాస్తవానికి తాను దీన్ని రూపుమాపడానికి 2014లో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదని.. ఈసారి 2024 ఎంపీగా గెలిస్తే ఎన్నికల ఫలితాలొచ్చిన జూన్-05 నుంచే కచ్చితంగా దీన్ని అణిచివేసే పోరాటం చేస్తానన్నారు. గిరిజన ప్రాంతానికి.. గిరిజన బిడ్డలకు అండగా నిలబడటానికి సిద్ధంగా ఉన్నట్లు గీత వెల్లడించారు.
Featured
Crime News : ఆరు నెలలుగా మైనర్ బాలికపై లైంగిక దాడి… ఒంటిపై పంటిగాట్లు గుర్తించి !
Published
3 years agoon
26 January 2022By
lakshanaCrime News : కాలం గడుస్తున్న కొద్దీ మహిళలు, ఆడపిల్లలపై ఆకృత్యాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గట్లేదు. కౌమార దశలో ఉండే పదమూడు సంవత్సరాల మైనర్ బాలిక శారీరంగా వచ్చే మార్పులు ఆమెను ఓ దారుణానికి వాడుకున్నాయి. తాను ఏం చేస్తున్నానో తెలియని చిన్న వయస్సు ఒకవేళ తెలిసినా.. దాని పరిణామాలు ఎలా ఉంటాయో చేసుకోని వయస్సులో ఉంది ఆ చిన్నారి. అయితే ఓ కామ పిశాచికి ఇవే అనుకూలంగా మారాయి.
ఆ చిన్నారీలో వచ్చే శారీరక మార్పులకు తీయని మాటలు చెప్పి తనకు కావాల్సిందేదో తీసుకునేందుకు శతవిధాల ప్రయాత్నాలు చేశాడు. వాడి ప్రయత్నాలకు ఆ బాలిక లొంగిపోయింది. తనకు కావల్సిన విధంగా ప్రవర్తించింది. దీంతో ఆమెను శారీరంగా వాడుకున్నాడు. అదే క్రమంలో శరీరంపై కొరికాడు… కాని ఆ పంటిగాట్లు వాడి పైశాచికత్వాన్ని బయటపెట్టాయి. రెండు రోజుల క్రితం బాలిక ఒంటిమీద పంటిగాట్లను చూసిన తల్లి ఏమైందని అడిగారు. దీంతో జరిగిన విషయాన్ని ఆ బాలిక పూసగుచ్చినట్టు చెప్పడంతో ఆమె ఒక్కసారిగా షాక్ కు గురైంది.
జహిరాబాద్‌కు చెందిన మహ్మద్ మోహిజ్‌కు 20 సంవత్సరాలు. అతను నగరంలోని ఎమ్‌ఎస్ మక్తాలోని తన సోదరీ నివాసంలో ఉంటూ వెల్డింగ్ వర్క్స్ చేస్తున్నాడు. అయితే వారు ఉండే ఇంటిలోనే మరో కుటుంబం కూడా అద్దెకు ఉంటుంది. ఆ ఇంట్లో ఓ మైనర్ బాలిక ఉండడంతో మోహిజ్ ఆ బాలికపై కన్నేశాడు. ఇంట్లో ఎవరు లేనప్పుడు ఆమెను బిల్డింగ్ పైకి తీసుకువెళ్లి లైంగిక చర్యకు పాల్పడుతున్నాడు.
ఈ వ్యవహారం ఎప్పటి నుంచి జరుగుతుందంటే ?
ఇలా ఆరు నెలలుగా తన వ్యవహారాన్ని నడిపిస్తున్నాడు. అయితే ఇటివల ఆ బాలిక శరీరంపై పంటి గాట్లు ఉండడాన్ని గమనించిన తల్లిదండ్రులు గమనించారు. దీంతో ఏం జరిగిందని నిలదీయడంతో ఆసలు విషయం చెప్పింది. దీంతో మోహిజ్ చేసిన దురాగతంపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోహిజ్‌ను పట్టుకుని దేహశుద్ది చేశారు. ఆతర్వాత స్థానిక పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Featured
Viral News : ఒక్క నిమిషంలో ఆ ఘనత సాధించి గిన్నీస్ బుక్ లో చోటు… ఆ కుర్రాడు ఎవరంటే ?
Published
3 years agoon
26 January 2022By
lakshanaViral News : గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించడం అంటే గొప్ప విషయం అనే చెప్పాలి. అలాంటి రికార్డ్ సృష్టించిన వ్యక్తిని తలదన్ని కొత్త రికార్డు సృష్టించడం ఇంకా కష్టం. కానీ మణిపూర్‌కి చెందిన బాడీ బిల్డర్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌ని అతి సునాయాసంగా బద్దలు కొట్టాడు. 24 సంవత్సరాల తౌనోజామ్ నిరంజోయ్ సింగ్ అనే యువకుడు కేవలం నిమిషంలో చేతి వేళ్లను నేలపై మోపి అత్యధిక పుష్ అప్‌లు తీసి ఔరా అనిపించాడు.
గతంలో 2009 మే 25న యునైటెడ్ కింగ్డమ్ కి చెందిన గ్రాహం మాలీ నిమిషంలో 105 పుష్ అప్ చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నెలకోల్పితే…అతడి రికార్డును బద్దలు కొట్టాడు నిరంజోయ్ సింగ్. జనవరి 14న ఇంపాల్‌లో ఈ అరుదైన రికార్డును సృష్టించాడు నిరంజోయ్‌సింగ్. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు, స్థానికుల సమక్షంలో కేవలం 60 సెకన్లలో 109 పుష్ అప్స్ చేసి తన పేరును గిన్నీస్ బుక్‌లో ఎక్కేలా చేశాడు నిరంజోయ్ సింగ్.
నిరంజోయ్ సింగ్‌కు పుష్ అప్స్‌లో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించడమే కాదు గతంలో కూడా ఎన్నో క్రీడలు, ఆటలతో పాటు బాడి బిల్డింగ్‌లో పతకాలు సాధించాడు. మణిపాల్ లోని ఇంపాల్ ప్రాంతంలో ఇలాంటి యువకులు చాలా మంది యువకులు నిరంజోయ్‌సింగ్‌ని ఆదర్శంగా తీసుకొని క్రీడలపై ఆసక్తి పెంచుకుంటున్నారు.
మణిపూర్ ఆణిముత్యం అంటూ ప్రశంసిస్తున్న ప్రముఖులు…
మణిపూర్‌కి చెందిన ఈ యువకుడు సాధించిన ఈ ఘనతను కేంద్రమంత్రి కిరణ్ రిజిజు అభినందించారు. ఊహించని విజయాన్ని దక్కించుకున్నావు అంటూ ట్వీట్ చేశారు కిరణ్ రిజిజు. అలానే 24 సంవత్సరాల యువకుడు నిమిషంలో 109 పుష్ అప్స్ చేయడం గొప్ప విషయమని మణిపూర్ మంత్రులు, జిల్లా కలెక్టర్ చెప్పుకొచ్చారు. నిరంజోయ్‌సింగ్‌ని సన్మానించారు. నిమిషంలో 120 పుష్ అప్స్ చేసేందుకు ప్రయత్నిస్తానంటున్నాడు నిరంజోయ్‌సింగ్. అతని ప్రయత్నం సఫలం కావాలని… మరో రికార్డు నెలకోల్పాలని అందరం కోరుకుందాం.
Tollywood: పవన్, రాజమౌళి కాంబోలో మూవీ.. అడ్డంగా ఇరికించేసిన జక్కన్న!
Nagarjuna: కొండా సురేఖ పై క్రిమినల్ చర్యలు తీసుకోండి: నాగార్జున
Kavya Thapar: నవరాత్రుల్లో ఉపవాసం ఉంటున్న హీరోయిన్.. అందుకోసమేనా!
Nidhhi Agerwal: రాజాసాబ్ నుంచి అలాంటి ఫోటో షేర్ చేసిన నిధి అగర్వాల్.. ఫోటో వైరల్!
Tollywood: చిరు రిజెక్ట్ చేసిన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నటుడు.. ఎవరో తెలుసా?
Nithya Menon: నిత్యామీనన్ మలయాళీ అమ్మాయి కాదా… తన అసలు పేరు అదేనా?
Abhay Naveen: బిగ్ బాస్ ను అందుకే తిట్టాను… అసలు కారణం బయటపెట్టిన అభయ్ నవీన్!
Soundarya: సౌందర్య చనిపోతుందని ఆ వ్యక్తికి ముందే తెలుసా… ఆమె మరణంలో కుట్ర జరిగిందా?
Manikanta: అలా మాట్లాడటం సరికాదు.. మణికంఠ భార్యకు మద్దతుగా నిలిచిన సోదరి!
Vadde Naveen: ఈ టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో వడ్డే నవీన్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు… ఎలా ఉన్నాడో తెలుసా?
Trending
- Featured4 weeks ago
Nithya Menon: నిత్యామీనన్ మలయాళీ అమ్మాయి కాదా… తన అసలు పేరు అదేనా?
- Featured2 weeks ago
Abhay Naveen: బిగ్ బాస్ ను అందుకే తిట్టాను… అసలు కారణం బయటపెట్టిన అభయ్ నవీన్!
- Featured4 weeks ago
Soundarya: సౌందర్య చనిపోతుందని ఆ వ్యక్తికి ముందే తెలుసా… ఆమె మరణంలో కుట్ర జరిగిందా?
- Featured4 weeks ago
Manikanta: అలా మాట్లాడటం సరికాదు.. మణికంఠ భార్యకు మద్దతుగా నిలిచిన సోదరి!
- Featured4 weeks ago
Vadde Naveen: ఈ టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో వడ్డే నవీన్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు… ఎలా ఉన్నాడో తెలుసా?
- Featured4 weeks ago
Actress Rohini: కమిటీ సిద్ధం చేసాము…వేధింపుల గురించి మీడియా ముందు మాట్లాడొద్దు: రోహిణి
- Featured1 week ago
Samantha: నిన్ను ఎవరు మ్యాచ్ చేయలేరు.. మెగా హీరో పై సమంత కామెంట్స్!
- Featured4 weeks ago
Star Heroin: లిప్ లాక్… రక్తం కారుతున్న హీరోయిన్ ను వదిలిపెట్టని హీరో.. అంతలా రెచ్చిపోయారా?