ఈ ప్రపంచంలో మన ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడం కోసం ఎన్నో వ్యసనాలు ఉంటాయి. అయితే ఈ విధమైనటువంటి చెడు వ్యసనాల వల్ల ఎన్నో ప్రమాదాలను, సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ చెడు అలవాట్లకు బానిసకావడం ఎక్కువ కాలం పట్టదు. అయితే ఈ చెడు వ్యసనాల నుంచి బయటకు రావాలంటే ఎంతో సమయం పడుతుంది.

ముఖ్యంగా ధూమపానం, మద్యపానం వ్యసనాలను మానేయాలనుకునేవారు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు.ఈ అలవాట్ల నుంచి బయటపడేందుకు డీఅడిక్షన్ లేదా రీహాబిలిటేషన్ సెంటర్‌లో కూడా చేరుతుంటారు.కానీ ఓ వ్యక్తి మాత్రం ఎంతో భిన్నంగా ఇలాంటి చెడు వ్యసనాల నుంచి బయట పడటం కోసం తనకు తానే శిక్ష విధించుకున్నాడు.

టర్కీలోని కోతహ్యాలో నివసిస్తున్న ఇబ్రహిం యుసెల్‌ 20 ఏళ్ల నుంచి స్మోకింగ్ చేస్తున్నాడు. అది అతడికి వ్యసనంగా మారింది అయితే ఈ అలవాటు నుంచి బయట పడటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే తన తండ్రి కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ తో చనిపోవడం వల్ల ఎలాగైనా ఈ వ్యసనం నుంచి బయట పడాలని తనకుతానే శిక్ష విధించుకున్నాడు.

ఇబ్రహిం 130 అడుగుల కాపర్ వైర్‌ను తీసుకుని హెల్మెట్ తరహాలో పంజరాన్ని నిర్మించాడు. బండి పై వెళ్లేటప్పుడు మనము హెల్మెట్లు తీసేయొచ్చు. కానీ ఇతను తయారుచేసుకున్న హెల్మెట్ మాత్రం తీయడానికి కుదరదు.హెల్మెట్ ధరించి బయటకు వెళ్ళినప్పుడు తనకు ఏమాత్రం సిగరెట్ తాగడానికి అవకాశం లేకుండా తయారు చేసుకున్నాడు. ఇబ్రహీం హెల్మెట్ ధరించి బయటకు వెళ్ళినప్పుడు హెల్మెట్ కు తమ కుటుంబ సభ్యులు తాళం వేసి పంపుతారు. ఈ క్రమంలోనే ఇబ్రహీం బయటకు వెళ్ళినప్పుడు సీక్రెట్ తాగాలనే ఆలోచన వచ్చినా కూడా తాగలేని పరిస్థితి కనుక ఇబ్రహీం ఈ వ్యసనం నుంచి బయటపడటానికి ఈ విధంగా పంజరం తయారుచేసుకుని తనకు తానే శిక్ష విధించుకున్నాడు.ఇబ్రహిం తలకు పంజరాన్ని ధరించిన చిత్రాలను ఈ వీడియోలో చూడవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here