సాధారణంగా మన దేశంలో తుఫాన్ అంటే వర్షం భీభత్సం సృష్టిస్తుందనే సంగతి తెలిసిందే. అయితే పలు దేశాలను మాత్రం ఇసుక తుఫాన్ లు గజగజా వణికిస్తున్నాయి. ఇసుక తుఫాన్ ల ధాటికి ప్రజలు గాయాలపాలవుతున్నారు. తాజాగా ఎడారి దేశమైన టర్కీని ఇసుక తుఫాను భయపెట్టింది. అక్కడి ప్రజల్లో ఆరుగురు ఇసుక తుఫాన్ వల్ల గాయాలపాలయ్యారు. ఆకాశం ఎత్తు రేగిన ఇసుక తుఫాన్ నగరాలకు నగరాలను కప్పేస్తోంది.

టర్కీ రాజధాని అంకారా, పొలాటి ప్రాంతాల ప్రజలు ఇసుక తుఫాన్ వలల్ పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఒక పెద్ద భూతం నగరాన్ని కబళించడానికి వస్తే ఏ విధంగా ఉంటుందో ఇసుక తుఫాన్ రేగుతున్న దృశ్యాలు చూస్తే అదే భావన కలుగుతోంది. అంకారా మేయర్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా సోషల్ మీడియాలో ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

ఎక్కువ అంతస్థులు ఉన్న ప్రాంతాల నుంచి కొందరు ఇసుక తుఫాన్ కు సంబంధించిన విజువల్స్ ను షూట్ చేశారు. అంత ఎత్తు నుంచి షూట్ చేసినా వారు ఉన్న ప్రాంతానికి పదింతలు ఎక్కువ ఎత్తులో ఇసుక తుఫాన్ రేగింది. ఆకాశం గాల్లోకి ఎగజిమ్మిన ఇసుక రేణువుల వల్ల నారింజ రంగులోకి మారడం గమనార్హం. ఇసుక తుఫాన్ వల్ల వాహనాల్లో ప్రయాణాలు చేసే వాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

కార్లలో ప్రయాణించే ప్రయాణికులకు కార్లు, ఇతర వాహనాలు కనిపించలేదు. మరి కొంత సమయం ఇదే పరిస్థితి కొనసాగితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అక్కడి ప్రయాణికులు భావించారు. మిడిల్ఈస్ట్ ప్రాంతాల్లో ఇసుక తుఫాన్లు ఎక్కువగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటాయి. ఏడాదికి కనీసం రెండు సార్లు ఇలాంటి ఇసుక తుఫాన్ వస్తుందని అక్కడి ప్రజలు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here