చావు బతుకుల మధ్య ఆ సీరియల్ నటి.. ఆమె పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు!

0
877

సాధారణంగా సెలబ్రిటీలు అంటే వారి దగ్గర ఎంతో డబ్బులు ఉంటాయి. వారి జీవితం చాలా బాగుంటుందని భావిస్తాము.కానీ సినిమా సెలబ్రిటీలు అయిన ఎంతోమంది చివరికి ఆర్థికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొని చావుబతుకుల మధ్య ఎంతో మంది సహాయ సహకారాలు కోరడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా బుల్లితెర నటితీవ్రమైన అనారోగ్య సమస్యతో ఆసుపత్రి పాలయ్యారు. ఈ సమయంలో దాతలు ఎవరైనా తనకు సహాయం చేయాలి అంటూ కన్నీటి పర్యంతం అయ్యింది.

హిందీ సీరియల్స్ లో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి అనయా సోని. నామ్‏కరన్, క్రైమ్ పెట్రోల్ లాంటి సీరియల్స్‌తో ఈమె బాగానే గుర్తింపు సంపాదించుకున్న నటి ఆర్థికంగా ఎంతో మంచి స్థాయిలో ఉండేది. ఈ క్రమంలోనే ఈమె రెండు కిడ్నీలు పాడవడం తో తన సొంత డబ్బులతో వైద్యం చేయించుకుంది. అయితే ప్రస్తుతం తన చికిత్స కోసం డబ్బులు లేకపోవడంతో దాతల సహాయాన్ని కోరుతూ కన్నీటిపర్యంతమయ్యారు.

ప్రస్తుతం ఈ నటి ముంబైలోని హూలీ స్పిరిట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.రెండు కిడ్నీలు పాడవడంతో తన తండ్రి కిడ్నీ దానం చేయగా అది కూడా పాడైందని ప్రస్తుతం దాతల సహాయంతో ఎంతో అవసరమని, ప్రస్తుతం తనకి కిడ్నీ మార్పిడి తప్ప వేరే అవకాశం లేదని ..అందుకు చాలా డబ్బులు అవసరం అవుతాయని వాపోయింది.

ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో తనకు డయాలసిస్ జరగాల్సి ఉందని. కానీ కిడ్నీ దాత కోసం ఎదురుచూస్తున్నట్లు చెబుతూ తన వివరాలను ట్వీట్ చేసింది.Name :- Sheetal t . soni
Bank name :- Axis bank
Branch:- malad west
Ac no. 915010026602327
IFS code:- UTIB0000062
Pan no . :- EJYPS7926A
upi I’d :- sheetal.soni2@axisbank అంటూ తన వివరాలను తెలుపుతూ దాతలు తనకు సహాయం చేయాల్సిందిగా కోరింది.