సినీనటుడు వాసుదేవ్.. ఈయన సినిమా, సీరియల్స్ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఈయన సోదరుడు వదిన ఇద్దరు యాక్టర్స్. అన్న శ్రీధర్ రావు, వదిన విద్యా రావు. వీరిద్దరూ సినిమాల్లో నటిస్తుంటారు. వాసు అనేక సీరియల్స్ లో నటించారు. అపరంజి, అశోకవనం, భార్యామణి, కుంకుమరేఖ, మనోయజ్ఞం, లవ్, శ్రీకృష్ణన్ యువ లాంటి అనేక సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో లేకపోయారు. ఆయన కేవలం సీరియల్ నటుడు మాత్రమే కాకుండా ఓ మోడల్ గా కూడా రాణించారు. ఈయన సొంత ఊరు తెలంగాణ రాష్ట్రంలోని మెదక్. కానీ ఈయన పెరిగింది మాత్రం ఆల్వాల్ లో. ఈయన తల్లిదండ్రులు మెదక్ జిల్లాలోని కోటిపల్లి లో జన్మించారు. వీరిది వ్యవసాయ కుటుంబం. వాసుదేవ్ ఎంబీఏలో ఫైనాన్స్ కూడా పూర్తి చేశాడు. ఆ తర్వాత అమెరికా వెళ్లడం కూడా ప్రయత్నాలు చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన అమెరికా వెళ్ళలేకపోయాడు. దీంతో ఆయన పాఠశాలకు సంబంధించి మోడలింగ్ వైపు అడుగులు వేశాడు. ఈ సమయంలోనే 2002లో ఆయన మిస్టర్ ఇండియా గా ఎన్నికయ్యాడు.

ఈయన అనేక కంపెనీలకు చెందిన వాణిజ్య ప్రకటనల్లో మోడల్ గా నటించాడు. ఈయన కు బాలీవుడ్ లో అర్జున్ రాంపాల్ అంటే బాగా ఇష్టం.ఈయన మాత్రమే కాకుండా ఈయన తమ్ముళ్లు ఇద్దరు కూడా నటనా రంగంలో మాత్రమే కాకుండా మోడలింగ్ రంగంలో కూడా రాణిస్తున్నారు. వాసుదేవ్ ఖడ్గం సినిమాలో ఓ క్యారెక్టర్ రోల్ కూడా పోషించాడు. అంతేకాదు ఎవరే అతగాడు సినిమాలో సెకండ్ హీరోగా కూడా నటించిన అనుభవం ఉంది. ఆ తర్వాత ఒక నాలుగు సంవత్సరాల పాటు తన వ్యాపారానికి సంబంధించిన పనుల్లో బిజీ అయిపోయాడు. ఆ తర్వాత యువ సీరియల్ లో మనీ పాత్రను పోషించారు. ఇక తెలుగు ఇండస్ట్రీలో నటుడిగా పవన్ పెద్దగా నటించకపోయినా కేవలం ఆయన వ్యక్తిత్వం ఆయన అంటే ఇష్టమని చెప్పారు.

ఇక ఈయనకు ఇష్టమైన హీరోయిన్స్ ల విషయానికొస్తే.. టాలీవుడ్ ఇండస్ట్రీలో అనుష్క, బాలీవుడ్ లో సోనమ్ కపూర్ అంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఆయన ఇదివరకు అనుష్కతో ఓసారి కలిసి నటించాడు. అది ఎలా అంటే ఇదివరకు యువ సీరియల్ లో అనుష్క ఓ పాత్రను పోషింది. ఆ సమయంలో వీరిద్దరూ కలిసి నటించారు. మన భారతదేశం లోని ఎన్నో ప్రముఖ కంపెనీలకు వాణిజ్య ప్రకటనలలో మోడలింగ్ చేసి ఎంతో మంచి పేరును సంపాదించుకున్నారు.